Best Yoga Asanas: రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మన శరీరం నిరంతరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు గట్టిగా, బలంగా ఉండటం చాలా ముఖ్యం. మరి ఎలాంటి మందులు లేకుండా, ఇంట్లోనే ఉంటూ మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలాగో తెలుసా? దానికి యోగా ఒక్కటే అద్భుతమైన మార్గం.రోజూ కొన్ని నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ అద్భుతంగా పెరుగుతాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే ఆ ముఖ్యమైన ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భుజంగాసనం (కోబ్రా పోజ్):

ఈ ఆసనం వేసినప్పుడు బోర్లా పడుకుని ఛాతీని పైకి లేపుతాం. దీనివల్ల ఊపిరితిత్తులు బాగా వ్యాకోచించి, శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల కండరాలు బలంగా మారుతాయి.

ధనురాసనం (బో పోజ్):

విల్లు ఆకారంలో శరీరాన్ని వంచే ఈ ఆసనం వల్ల ఛాతీ భాగం పూర్తిగా తెరుచుకుంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో గాలి సామర్థ్యాన్ని పెంచి, శ్వాసకోశ నాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది.

ఆసనాలతో పాటు ఊపిరితిత్తులను క్లీన్ చేయడంలో ప్రాణాయామాలు చాలా కీలకంగా పనిచేస్తాయి.

అందులో ప్రధానమైనది.. కపాలభాతి ప్రాణాయామం

వేగంగా శ్వాసను బయటకు వదిలే ఈ ప్రక్రియ వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా వ్యర్థాలు పూర్తిగా బయటకు పోతాయి. ఇది ఊపిరితిత్తులకు మంచి వ్యాయామాన్ని అందిస్తుంది.

అనులోమ విలోమ ప్రాణాయామం (నాడి శోధన):

ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి తీసుకుని, రెండో దాని ద్వారా వదలడం వల్ల శరీరంలోని ఇడా, పింగళ నాడులు శుద్ధి అవుతాయి. ఇది ఊపిరితిత్తుల చివరి భాగం వరకు ఆక్సిజన్‌ను చేరవేసి, ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం కేవలం 15 నుండి 20 నిమిషాల పాటు ఈ యోగాసనాలు, ప్రాణాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story