Brain Function: విటమిన్ సి అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం. కానీ, ఇది మన మెదడు ఆరోగ్యంలోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా జరిగిన ఒక పరిశోధనలో తేలింది. ముఖ్యంగా వృద్ధుల్లో విటమిన్ సి మోతాదులు తక్కువగా ఉంటే.. అది మెదడులో విషయగ్రహణ శక్తి క్షీణించడానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

"మన మెదడులోని జ్ఞాపకశక్తి, అంతర్గత ఆలోచనా ప్రక్రియలను అనుసంధానించే విభాగాన్ని 'డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్' లేదా DMN అంటారు. ఈ నెట్‌వర్క్ గనుక క్షీణిస్తే విషయగ్రహణ లోపంతో పాటు.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన మతిమరుపు జబ్బుల ముప్పు ముంచుకొస్తుంది. విటమిన్ సి తక్కువగా ఉండే వృద్ధుల్లో మెదడులోని బూడిద రంగు భాగం (Grey Matter), అలాగే ఈ డీఎంఎన్ (DMN) అనుసంధాన సామర్థ్యం గణనీయంగా తగ్గుతున్నట్టు పరిశోధకులు క్లియర్ గా గమనించారు."

"అసలు విటమిన్ సి మెదడును ఎలా కాపాడుతుందంటే.. ఇది మన శరీరమంతటా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మెదడులో వాపుప్రక్రియకు కారణమయ్యే విశృంఖల కణాలను (Free Radicals) నిర్వీర్యం చేయటంలో ఇది అద్భుతంగా సాయపడుతుంది. ఈ ప్రక్రియే మెదడుకు రక్షణ కవచంగా నిలుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి కేవలం ఇమ్యూనిటీ కోసమే కాదు.. మెదడు చురుగ్గా పని చేయాలన్నా, వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా ఉండాలన్నా రోజువారీ ఆహారంలో విటమిన్ సి తగినంత ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story