Can’t Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. రోజంతా కష్టపడినా, పక్కన చేరగానే నిద్ర పట్టక గంటల తరబడి ఎదురుచూడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే నిద్ర రాకపోవడానికి మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు 60 నిమిషాలు మనం చేసే పనులు మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయి.

డిజిటల్ పరికరాల వాడకం

పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం మనకు అలవాటు. కానీ, మొబైల్ ఫోన్ల నుండి వెలువడే బ్లూ లైట్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల మెదడు ఇంకా పగలే అని భ్రమపడి, మేల్కొని ఉంటుంది. నిద్రపోవడానికి కనీసం గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టండి.

భోజన సమయం - కెఫిన్:

రాత్రి 9 లేదా 10 గంటలకు భారీ భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచి నిద్రను దూరం చేస్తుంది. పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం ముగించండి. ఆకలిగా అనిపిస్తే పాలు లేదా నట్స్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి.

రాత్రిపూట తీవ్రమైన వ్యాయామం:

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ, పడుకునే ముందు చేసే కఠినమైన వర్కవుట్లు శరీర ఉష్ణోగ్రతను హృదయ స్పందన రేటును పెంచుతాయి. దీనివల్ల శరీరం ప్రశాంతతకు బదులుగా ఉత్తేజితం అవుతుంది, ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

సుఖ నిద్ర కోసం వైద్య నిపుణులు సూచిస్తున్న కొన్ని సులభమైన మార్గాలు..

పుస్తక పఠనం: ఫోన్ చూసే బదులు ఏదైనా పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

గోరువెచ్చని స్నానం: నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.

మసక వెలుతురు: పడకగదిలో లైట్లను మసకగా ఉంచి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. ఇది మెదడుకు నిద్ర సమయం అయిందని సంకేతాలను పంపుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story