Coconut Water vs Sugarcane Juice: ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్తే భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మన శరీరం సహజంగానే చల్లదనాన్ని కోరుకుంటుంది. దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ వైపు వెళ్లకుండా.. ప్రకృతి సిద్ధంగా లభించే బెస్ట్ ఆప్షన్స్ కోసం అందరూ వెతుకుతుంటారు. అవే కొబ్బరి నీళ్లు, చెరకు రసం. అయితే, ఈ రెండింటిలో మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్? ఏది ఎంచుకుంటే మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడుకుంటే.. ఇవి ప్రకృతి అందించిన అద్భుతమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎండలో తిరగడం వల్ల లేదా వ్యాయామం చేయడం వల్ల మనం కోల్పోయే లవణాలను తిరిగి నింపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇందులో చక్కెర శాతం చాలా తక్కువ, కేలరీలు కూడా తక్కువే! కాబట్టి బరువు పెరగకూడదు అనుకునే వారికి, శరీరం ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉండాలి అనుకునే వారికి ఇది ఒక 'పర్ఫెక్ట్ ఛాయిస్'.

ఇక చాలా మందికి ఇష్టమైన స్వీట్ డ్రింక్ చెరకు రసం. ఇందులో పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, దీని ప్రధాన బలం ఇందులో ఉండే సహజమైన చక్కెర. ఎండలో నడిచి బాగా అలసిపోయినప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే.. అది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇన్‌స్టంట్ రీఛార్జ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఎనర్జీ బూస్టర్. అంతేకాకుండా, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.

రెండింటినీ పోల్చి చూస్తే.. ఆరోగ్య పరంగా కొబ్బరి నీళ్లే ఒక మెట్టు పైన ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో చక్కెర తక్కువ, ఎలక్ట్రోలైట్లు ఎక్కువ. ఇది శరీరాన్ని ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.అయితే, మీకు వెంటనే శక్తి కావాలి అనుకుంటే మాత్రం చెరకు రసం బెస్ట్. కానీ గుర్తుంచుకోండి.. ఇందులో కేలరీలు ఎక్కువ కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు లేదా డయాబెటిస్ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం మంచిది.

సింపుల్‌గా చెప్పాలంటే.. కేవలం దాహం తీర్చుకుని శరీరాన్ని కూల్ చేసుకోవాలంటే కొబ్బరి నీళ్లు తాగండి. రుచికరమైన ఎనర్జీ బూస్ట్ కావాలనుకుంటే చెరకు రసాన్ని ఎంచుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story