Cumin Water vs Fenugreek Water: జీలకర్ర vs మెంతి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

Cumin Water vs Fenugreek Water: భారతీయ వంటగది పదార్థాలను తరచుగా ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. మన అమ్మమ్మల కాలం నాటి ఈ ఇంటి చిట్కాలే నేటి జనరేషన్‌కు ట్రెండీ హెల్త్ హాబిట్స్‌గా మారాయి. ప్రస్తుతం చాలా మంది తమ ఉదయాన్ని జీలకర్ర లేదా మెంతుల నీటితో ప్రారంభిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇవి బరువు తగ్గించే మాయా డ్రింక్స్‌గా, అద్భుతమైన డిటాక్స్ డ్రింక్స్‌గా విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. నిపుణుల ప్రకారం ఇవి అందరి శరీరంపై ఒకేలా పనిచేయవు. ప్రతి డ్రింక్ శరీరంపై విభిన్న ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో వైద్యులు వివరించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
జీలకర్ర నీరు: జీర్ణక్రియకు అమృతం
బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బాలాజీ ప్రకారం.. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సురక్షితమైనది, అత్యంత ప్రభావవంతమైనది. ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌లు, పైత్యరసం స్రావాన్ని పెంచి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా కడుపులో బరువుగా అనిపించే సమస్యలతో బాధపడేవారికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం ఉత్తమమైన మార్గం. ఒక టీస్పూన్ జీలకర్ర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే వడకట్టి ఆ నీటిని తాగాలి.
మెంతుల నీరు: షుగర్ కంట్రోల్‌కు కేరాఫ్ అడ్రస్
జీవక్రియను వేగవంతం చేయడంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతుల నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మెంతులలో కరిగే పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులలో పిండిపదార్థాల శోషణను నెమ్మదింపజేస్తుంది. ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది అత్యంత ప్రయోజనకరమైనది. అలాగే దీర్ఘకాలిక మలబద్ధకం, మందగించిన జీర్ణక్రియ ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. మెంతుల నీటి రుచి కొద్దిగా చేదుగా, శరీరంపై వేడిని కలిగించేలా ఉంటుంది. దీనిని అతిగా తాగడం వల్ల విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్న రోగులు, తమ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
జీలకర్ర నీరు గ్యాస్, అజీర్తి వంటి తక్షణ జీర్ణ సమస్యల ఉపశమనానికి పనిచేస్తే.. మెంతుల నీరు షుగర్ కంట్రోల్, మెటబాలిజం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. మీ శరీర తత్వాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోండి..
- Cumin WaterFenugreek WaterJeera WaterMethi WaterHealthy DrinksHealth TipsNutritionWellnessDigestive HealthWeight LossHealthy LifestyleNatural RemediesMorning Health RoutineMetabolismHerbal DrinksPreventive HealthcareDaily Health TipsLatest Telugu NewsHealth UpdatesHealthy LivingTraditional RemediesFitness Nutrition

