Use Neem Leaves and Neem Oil for Your Face: వేపాకు, వేపనూనెను ముఖానికి ఎలా వాడాలో తెలుసా?
ఎలా వాడాలో తెలుసా?
Use Neem Leaves and Neem Oil for Your Face: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కోసం అమ్మాయిలు పడే తంటాలు అన్నీఇన్నీ కావు కదా! మార్కెట్లోకి కొత్తగా ఏ ఫెయిర్‌నెస్ క్రీమ్ వచ్చినా, లోషన్స్ వచ్చినా, సబ్బులు వచ్చినా.. వెనకా ముందూ ఆలోచించకుండా కొనేస్తుంటారు. కానీ, మీకో విషయం తెలుసా? మీరు వాడే ఆ ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మరేంటో కాదో.. మన ఇంటి పెరట్లో దొరికే వేపాకు, వేపనూనెలే!. కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు.. డైరెక్ట్‌గా ఆ వేపాకును, వేపనూనెను మనం వాడొచ్చా? వాడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం.
మన పూర్వీకుల కాలం నుండి వేపను ఒక అద్భుతమైన ఔషధంగా వాడుతున్నారు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే మొటిమలను, మచ్చలను మాయం చేయడంలో మొండిగా పనిచేస్తాయి.
చర్మంపై మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు.. కొన్ని వేపాకులను మెత్తగా నూరి, అందులో కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. మొటిమలు తగ్గడమే కాదు, వాటి తాలూకు నల్లటి మచ్చలు కూడా మాయమవుతాయి.
ఇక వేపనూనె విషయానికొస్తే.. డ్రై స్కిన్ అంటే పొడి చర్మం ఉన్నవారికి ఇది ఒక వరమనే చెప్పాలి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఇ చర్మాన్ని లోపలి నుండి మాయిశ్చరైజ్ చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మం ఎప్పుడూ యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. అయితే, వేపనూనె చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, దానిని నేరుగా చర్మానికి రాయకూడదు. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి.. రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని, ఉదయాన్నే కడిగేసుకుంటే మీ చర్మం సాఫ్ట్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది. వేల రూపాయల కెమికల్ ప్రొడక్ట్స్ ఇచ్చే గ్లో కంటే.. మన ప్రకృతి ప్రసాదించిన వేప ఇచ్చే గ్లో ఎంతో సురక్షితం, అలాగే శాశ్వతం కూడా.



