Eating Oily Foods Frequently: మన లైఫ్‌స్టైల్‌లో ఆయిల్ ఫుడ్‌ను పూర్తిగా పక్కన పెట్టడం అంటే.. దాదాపు అసాధ్యం . బిర్యానీలు, బజ్జీలు, పూరీలు, సమోసాలు.. అబ్బో, ఈ నూనె పదార్థాలు నోటికైతే భలే రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్యానికి మాత్రం అంతే స్థాయిలో చిక్కులు తెచ్చిపెడతాయి. అలాగని నచ్చిన ఫుడ్‌కు దూరంగా మనం ఉండలేం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్... ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. అజీర్తి, గుండెల్లో మంట లాంటి సమస్యలన్నీ మాయమైపోతాయి.

మొదటి చిట్కా... నూనె పదార్థాలు తిన్న వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది చాలా పవర్‌ఫుల్ రెమెడీ. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల తిన్న ఫుడ్ త్వరగా అరుగుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఇక రెండోది.. గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఉండే 'ఫ్లేవనాయిడ్స్' జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అందుకే ఆయిలీ ఫుడ్ తిన్న గంట తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి.

మరో అద్భుతమైన చిట్కా.. పెరుగు! నూనెలో వేగించిన ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా పెరుగు తింటే మన జీర్ణ వ్యవస్థ చాలా యాక్టివ్ అవుతుంది. పెరుగులో ఉండే 'లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా' పొట్టను చల్లబరిచి, అసిడిటీ రాకుండా అడ్డుకుంటుంది. ఇక డైట్ బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒక పూట భోజనంలో ఆయిల్ ఫుడ్ తింటే.. ఆ తర్వాతి పూట భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ లాంటివి తీసుకోవాలి. ఈ ఫైబర్ ఫుడ్ కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల ప్రతిరోజూ మన క్యాలరీల డైట్ బ్యాలెన్స్ అవుతుంది.

చాలామంది ఆయిలీ ఫుడ్, బిర్యానీలు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ లేదా ఐస్‌క్రీమ్స్ లాంటి చల్లటి పదార్థాలు తింటుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పేగులు, పొట్ట, , లివర్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. జీర్ణక్రియ పూర్తిగా మందగిస్తుంది. లేటెస్ట్ హెల్త్ రీసెర్చ్‌లు కూడా ఇదే చెబుతున్నాయి... ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత కనీసం 3 నుండి 4 గంటల వరకు ఎలాంటి చల్లటి పదార్థాలు ముట్టకూడదు.

ఇక ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాతి రోజు కూడా మీ బాడీని కాస్త కేర్ చేయాలి. వీలైనంత వరకు నట్స్, సీడ్స్ (బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు) లాంటివి తింటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story