Excessive Hair Fall: విపరీతంగా జుట్టు రాలుతోందా? శరీరంలో ఆ ముఖ్య పోషకం లోపించడమే కారణం కావచ్చు..
కారణం కావచ్చు..

Excessive Hair Fall: ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, జీవనశైలి మార్పులు ఒకెత్తయితే.. శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం జుట్టు రాలడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడితే జుట్టు బలహీనపడి విపరీతంగా రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ ఎంత అవసరం, దాని లోప లక్షణాలు, ప్రొటీన్ లభించే ఉత్తమ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ ఎందుకు అంత ముఖ్యం?
మన జుట్టు 80% కంటే ఎక్కువ కెరాటిన్ అనే ఒక రకమైన ప్రొటీన్‌తోనే తయారవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ పరిమాణం తగ్గినప్పుడు, శరీరం ఉన్న కొద్దిపాటి ప్రొటీన్‌ను గుండె, కాలేయం వంటి అత్యంత ముఖ్యమైన అంతర్గత అవయవాలకు మళ్లిస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లకు ప్రొటీన్ అందక, జుట్టు ఎదుగుదల ఆగిపోయి ఊడిపోవడం ప్రారంభమవుతుంది.
ప్రొటీన్ లోపం వల్ల కనిపించే జుట్టు సమస్యలు
జుట్టు పలచబడటం:
ప్రొటీన్ తగ్గగానే కొత్త జుట్టు రావడం ఆగిపోయి, ఉన్న జుట్టు పలచబడుతుంది.
జుట్టు చిట్లడం - బలహీనపడటం
వెంట్రుకలు తేలికగా తెగిపోవడం, పొడిబారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది.
రంగు మారడం: ప్రొటీన్, ఇతర పోషకాల లోపం వల్ల జుట్టు సహజమైన మెరుపును కోల్పోయి రంగు వెలిసిపోయినట్లు మారుతుంది.
జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ లభించే ఉత్తమ ఆహారాలు
మనం ఇంట్లోనే రోజూ తీసుకునే సమతుల్య ఆహారం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు:
శాకాహారులకు :
పప్పుధాన్యాలు & గుళ్లు: పెసర్లు, శనగలు, రాజ్మా, అల్సందలు.
పాలు & పాల ఉత్పత్తులు: పనీర్, పెరుగు, పాలు.
నట్స్ & సీడ్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్.
సోయా ఉత్పత్తులు: సోయాబీన్, మీల్‌మేకర్.
మాంసాహారులకు:
గుడ్లు
చికెన్
చేపలు
ఇతర ఉపయోగకరమైన చిట్కాలు
రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌తో పాటు విటమిన్-సి, ఐరన్ మరియు జింక్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.
తగినంత నీరు తాగడం, తలకు మృదువైన నూనెలతో మసాజ్ చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది.

