Feeling Excessively Sleepy in the Afternoon: ప్రతిరోజూ మధ్యాహ్నం కాగానే మీ కళ్లు బరువెక్కుతున్నాయా..? తిన్న తర్వాత ఒకే సమయానికి విపరీతమైన నిద్ర, ఒళ్లు సహకరించనంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా..? ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత కుదరక, పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారా..? అయితే ఇది కేవలం మీ ఒక్కరి సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనినే సైన్స్ భాషలో 'ఆఫ్టర్ నూన్ స్లర్ప్' (Afternoon Slump) అని పిలుస్తారు.

చాలా మంది ఈ అలసటకి కారణం.. ఆఫీసులో పని ఒత్తిడి అని అనుకుంటారు. కానీ నిజానికి దీనికి మీరు చేసే పని కంటే, మీ జీవనశైలి (Lifestyle) ప్రధాన కారణం. మన శరీరంలో ఉండే 'సర్కాడియన్ రిథమ్' లేదా బాడీ క్లాక్ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య సహజంగానే కాస్త మందగిస్తుంది. అయితే, మనం తీసుకునే ఆహారం ఈ సమస్యను మరింత పెంచుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భారీగా కార్బోహైడ్రేట్లు, అంటే ఎక్కువ రైస్ లేదా స్వీట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత పడిపోతాయి. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోతుంది.

నిద్రను తరిమికొట్టడం ఎలా?

మితంగా తినండి: మధ్యాహ్నం భోజనంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

నీరు త్రాగండి: శరీరంలో నీటి శాతం తగ్గినా (Dehydration) నీరసం వస్తుంది. అందుకే తరచుగా నీళ్లు తాగుతుండాలి.

చిన్న నడక: భోజనం తర్వాత ఒక 10 నిమిషాల పాటు అటు ఇటు నడవండి. ఇది మెదడుకు ఆక్సిజన్ అందించి మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది.

నిద్ర నాణ్యత: రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోవడం కూడా మధ్యాహ్నం పూట నిద్రకు ప్రధాన కారణం.

Next Story