Feeling Hungry at Midnight: పగలంతా కడుపు నిండా తిన్నా, రాత్రి కాగానే మళ్ళీ ఆకలిగా అనిపిస్తోందా? ఏదో ఒకటి తిననిదే నిద్ర పట్టడం లేదా? అయితే దీనిని కేవలం అలవాటుగా భావించి వదిలేయకండి. దీని వెనుక నైట్ ఈటింగ్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్య దాగి ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్?

సాధారణంగా శరీరానికి ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు మెదడు ఆకలి సంకేతాలను పంపుతుంది. కానీ వారానికి ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువగా ఇలా అర్ధరాత్రి నిద్రలేచి తినాలనిపించడాన్ని ఒక వ్యాధి లక్షణంగా పరిగణించాల్సి ఉంటుంది. డాక్టర్ల ప్రకారం, దీనిని నిర్లక్ష్యం చేస్తే అది దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది.

నిద్రకూ.. ఆకలికీ ఏంటి సంబంధం?

మనం సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ తలకిందులవుతుంది.

గ్రెలిన్ ప్రభావం:* రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారిలో గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీనిని హంగర్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది పెరిగే కొద్దీ ఆకలి విపరీతంగా వేస్తుంది.

భవిష్యత్తు ముప్పు: ఈ సమస్య ఇలాగే కొనసాగితే అధిక బరువు , మెటబాలిజం సమస్యలు మరియు చివరికి కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

కట్టడి చేయడం ఎలా?

మీరు ఈ సమస్య నుండి బయటపడాలంటే వైద్యులు సూచిస్తున్న కొన్ని చిట్కాలు ఇవే:

సమతుల్య ఆహారం: రోజులో 3 నుండి 4 సార్లు పోషకాలు ఉన్న ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకోండి.

లైట్ డిన్నర్: రాత్రిపూట జీర్ణం కావడానికి సులభంగా ఉండే తేలికపాటి భోజనం చేయండి.

సరైన నిద్ర: రాత్రి త్వరగా నిద్రపోయేలా అలవాటు చేసుకోండి. దీనివల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

ఒత్తిడికి దూరం: మానసిక ఒత్తిడి కూడా అర్ధరాత్రి ఆకలికి ఒక కారణం, కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story