Hands Burning After Cutting Green Chilies: వంటగదిలో పచ్చిమిర్చి కోయడం అనేది పెద్ద టాస్క్. మిర్చి కట్ చేసిన కాసేపటికే చేతులు విపరీతంగా మంట పుట్టడం చాలామంది ఎదుర్కొనే సమస్య. మరి ఈ మంట నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి, అసలు మంట పుట్టకుండా ఉండడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి చిట్కా: ఆయిల్ అప్లై చేయడం. పచ్చిమిర్చి కట్ చేయడానికి ముందే మీ చేతులకు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆవనూనె రాసుకోవాలి. ఇది చేతులపై ఒక రక్షణ పొరలా పనిచేసి మిర్చిలోని ఘాటు చర్మానికి అంటుకోకుండా చూస్తుంది.

ఇవి ఫాలో అవ్వండి

పాలు లేదా పెరుగు. ఒకవేళ మిర్చి కోసాక చేతులు మంట పుడితే.. వెంటనే చల్లటి పాలు లేదా పెరుగును చేతులకు రాసి ఐదు నిమిషాలు ఉంచాలి. పాలలో ఉండే క్యాసిన్ అనే ప్రొటీన్ మిర్చి ఘాటును వెంటనే తగ్గిస్తుంది.

మూడో చిట్కా: అలోవెరా జెల్ లేదా తేనె. చేతుల మంటను తగ్గించడంలో అలోవెరా జెల్ లేదా కొద్దిగా తేనె రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మాన్ని చల్లబరిచి మంటను త్వరగా తగ్గిస్తాయి.

నాల్గో చిట్కా: సిజర్స్ ఉపయోగించడం. వీటన్నింటికంటే బెస్ట్ ఆప్షన్.. పచ్చిమిర్చిని చేత్తో పట్టుకుని కత్తితో కోయడం కంటే, వంటగదిలో వాడే చిన్న కత్తెర (Kitchen Scissors) సహాయంతో కట్ చేస్తే మిర్చి రసం చేతులకు అస్సలు అంటదు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్‌ను పాటిస్తే మీ వంటపని మరింత సులభం అవుతుంది. ఇకపై పచ్చిమిర్చి కోసేటప్పుడు ఈ చిట్కాలను తప్పకుండా ట్రై చేయండి.

Next Story