Cups of Coffee Should You Drink a Day: రోజుకు ఎన్ని కప్పుల కాపీ తాగాలి..చక్కెర కలిపి తాగొచ్చా?
చక్కెర కలిపి తాగొచ్చా?

Cups of Coffee Should You Drink a Day: పొద్దున లేవగానే వేడి వేడి కాఫీ నోట్లో పడకపోతే చాలామందికి ఆ రోజు అస్సలు గడవదు! గుక్క గుక్కకూ హుషారు ఊపందుకుంటుంది. కాఫీ చేదు, చక్కెర తీపి, పాల కమ్మదనం కలిస్తే ఆ మజానే వేరు! ఫిల్టర్ కాఫీ అయినా, ఇన్‌స్టంట్ కాఫీ అయినా.. దేని రుచి దానిదే. అందుకే చాలామంది ఒక కప్పుతో ఆపలేరు. రోజుకు మూడు, నాలుగు సార్లు రుచి చూస్తేనే కానీ తనివి తీరదు.
అయితే, రోజుకు ఎన్ని కప్పులు తాగాలి? పాలు, చక్కెర కలపాలా? వద్దా? ఇలాంటి ప్రశ్నలెన్నో మనసులో మెదులుతుంటాయి. పైగా ఒక్కో పరిశోధన ఒక్కో రకంగా చెబుతుంటే ఏది నమ్మాలో అర్థం కాదు. కానీ, అదృష్టవశాత్తూ 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్'కు చెందిన 'సర్క్యులేషన్' జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ సందేహాలన్నింటికీ చెక్ పెట్టింది! దీన్ని కాఫీ విషయంలో ఒక కొత్త శాస్త్రీయ ప్రకటనగానే పరిగణిస్తున్నారు.
మరి ఈ తాజా అధ్యయనం ఏం చెబుతోంది? కాఫీతో అసలు ప్రయోజనాలున్నాయా? నిపుణుల ప్రకారం.. మితంగా తీసుకునే కాఫీ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు నిర్దిష్టమైన మోతాదులో కాఫీ తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అంది, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే, కాఫీ పేరుతో పంచదార, క్రీమ్‌లను విపరీతంగా కలిపితే మాత్రం లాభాల కంటే నష్టమే ఎక్కువని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది.

