Dry Fruits: పోషకాల నిలయం డ్రైఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, వీటిని రోజూ ఎంత మోతాదులో తినాలి? షుగర్ , గుండె జబ్బులు ఉన్నవారు వీటిని ఏ విధంగా తీసుకోవాలనే దానిపై ఆరోగ్య నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

డ్రైఫ్రూట్స్ వల్ల కలిగే లాభాలు

బాదం, వాల్‌నట్స్, పిస్తా, కిస్‌మిస్, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును పెంచడంలో,శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎక్కువగా తింటే మంచిది అనుకోవడం పొరపాటే.

ఎంత మోతాదులో తీసుకోవాలి?

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని సాధారణ వ్యక్తులు రోజూ గుప్పెడు (సుమారు 20 నుంచి 30 గ్రాముల) డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బాదం పప్పులు: రోజుకు 5 నుంచి 7.

వాల్‌నట్స్: రోజుకు 2 లేదా 4 హాఫ్‌లు.

పిస్తా: రోజుకు 10 నుంచి 15.

వీటిని అతిగా తింటే శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది.

బ్లడ్ షుగర్ , గుండె ఆరోగ్యం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

షుగర్ వ్యాధిగ్రస్తులు: ఖర్జూరం (Dates), ఎండుద్రాక్ష (Raisins) వంటి వాటిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే తీపి తక్కువగా ఉండే బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి నట్స్‌ను ఎంచుకోవడం మంచిది.

గుండె జబ్బులు ఉన్నవారు: ప్యాక్ చేసిన, ఉప్పు లేదా నూనెలో వేయించిన (Salted or Fried) డ్రైఫ్రూట్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం, చెడు కొవ్వులు ఉంటాయి, ఇవి గుండెకు హాని చేస్తాయి. వీలైనంత వరకు పచ్చివి లేదా నానబెట్టిన నట్స్‌ను తీసుకోవడం ఉత్తమం.

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి అమృతం లాంటివి.. కానీ వాటి మోతాదు హద్దు మీరితే మాత్రం అనర్థాలు తప్పవు. సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే.. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటంతో పాటు, మీ గుండె పదిలంగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story