Reverse Walking: జీవితంలో వెనకడుగు వేస్తే నష్టపోతామని పెద్దలు అంటుంటారు. కానీ, ఆరోగ్య విషయంలో మాత్రం వెనకడుగు వేస్తే అద్భుతమైన లాభాలు ఉంటాయని మీకు తెలుసా..? అవును.. మనం రోజు చేసే నడకను కాస్త రివర్స్‌గా.. అంటే వెనక్కి నడిస్తే మన శరీరానికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని సైంటిఫిక్ స్టడీస్ చెబుతున్నాయి. ఈ రోజుల్లో ఫిట్‌నెస్ నిపుణులు సైతం ఈ 'రివర్స్ వాకింగ్' వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. రివర్స్ వాకింగ్ లేదా రివర్స్ రన్నింగ్‌ను మించిన బెస్ట్ కార్డియో ఎక్సర్‌సైజ్ మరొకటి లేదు. నిపుణుల లెక్కల ప్రకారం, మీరు వేసే వంద అడుగుల రివర్స్ వాకింగ్.. వెయ్యి అడుగుల నార్మల్ వాకింగ్‌తో సమానం! మనం మామూలుగా నడిచేటప్పుడు కాలు వెనుక భాగంలో ఉండే కొన్ని కండరాలు అసలు కదలవు. కానీ, వెనక్కి నడిచినప్పుడు కాళ్లలోని అన్ని కండరాలు యాక్టివేట్ అయ్యి, కాళ్లు విపరీతమైన బలాన్ని పుంజుకుంటాయి.

ఈ రివర్స్ వాకింగ్ వల్ల కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్‌తో పాటు ఆక్సిజన్ సప్లై వేగవంతం అవుతుంది. మోకాళ్ల నొప్పులు, పాత గాయాలతో బాధపడేవాళ్లకు ఇది ఒక సంజీవని లాంటిదని తాజా రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఎందుకంటే వెనక్కి నడిచేటప్పుడు మోకాళ్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. ఫలితంగా మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఎలాంటి బాధ లేకుండా ఈజీగా వాకింగ్ చేయవచ్చు. అంతేకాదు, పాత నొప్పుల నుంచి కూడా ఇది త్వరగా రిలీఫ్ ఇస్తుంది.

ప్రతిరోజు కేవలం ఒక పావుగంట పాటు రివర్స్ వాకింగ్ చేస్తే వెన్ను నొప్పి (Back pain) మాయమవుతుంది. అలాగే, ఈ ఎక్సర్‌సైజ్‌ను క్రమం తప్పకుండా చేయడం వల్ల కేవలం ఒకటి రెండు నెలల్లోనే శరీర బరువులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా.. బ్రెయిన్, బాడీ మధ్య కో-ఆర్డినేషన్‌ను పెంచి మెదడును సూపర్ యాక్టివ్‌గా మారుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story