Eat These Dates: ఎక్కువ విటమిన్లు ఉండే పండ్లలో ఖర్జూరం కూడా ఒకటనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, మార్కెట్లో ఏడాది పొడవునా దొరికే ఎండు ఖర్జూరాల కంటే.. రంజాన్ మాసంలో లభించే పచ్చి డేట్స్ చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. ఎండు ఖర్జూరాలను నానబెట్టి చేసే 'పేండ్ ఖజూర్' కాకుండా.. నిండుగా పండులా మెరిసిపోయే ఈ డేట్స్ రుచే వేరు!

సాధారణ ఖర్జూరాలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువైనా.. ఈ సీజన్‌లో కనీసం ఒక్కసారైనా వీటిని టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే, ఈ డేట్స్‌లో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అందుకే వీటిని హ్యాపీగా హెల్తీ స్నాక్స్‌లా తినేయొచ్చు. ఇవి చాలా స్వీట్‌గా ఉంటాయి కాబట్టి.. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు చక్కెరకు బదులుగా కూడా వీటిని వాడుకోవచ్చు.

ఇక వీటిలోని పోషకాల విషయానికొస్తే.. డేట్స్‌లో విటమిన్ బి-1, బి-2, బి-3, బి-5 లతో పాటు విటమిన్ ఎ-1, విటమిన్-సి సమృద్ధిగా ఉంటాయి. రోజువారీ విటమిన్ల అవసరాల కోసం వీటిని మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. ఇవి తిన్న వెంటనే బాడీకి ఇన్‌స్టంట్‌ ఎనర్జీ ఇస్తాయి. అందుకే రోజంతా ఉపవాసం ఉండేవాళ్లు తమ ఉపవాసాన్ని విరమించడానికి కచ్చితంగా ఈ డేట్స్‌నే తింటారు.

అంతేకాదు ఫ్రెండ్స్.. ఈ ఖర్జూరాలలో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలకు అవసరమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా.. వయసు పెరిగే కొద్దీ వచ్చే ‘ఆస్టియోపొరాసిస్’ లాంటి ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయి.

ఎవరైతే జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటారో.. వారికి ఈ జ్యూసీ డేట్స్ ఒక మంచి మెడిసిన్‌లా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం సాఫ్ట్‌గా, కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ జ్యూసీ డేట్స్ కేవలం ఈ సీజన్‌లో మాత్రమే విరివిగా దొరుకుతాయి. !

PolitEnt Media

PolitEnt Media

Next Story