Loneliness, Isolation and Solitude: ఒంటరితనం, ఐసోలేషన్ ఏకాంతానికి తేడా ఏంటి?
తేడా ఏంటి?

Loneliness, Isolation and Solitude: ఆధునిక జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒంటరితనం. అయితే చాలామంది సోషల్ ఐసోలేషన్ అనగా సామాజిక ఏకాంతం, అలాగే లోన్లీనెస్ అనగా ఒంటరితనం రెండూ ఒకటే అని పొరపడుతుంటారు. కానీ, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మానసిక ఆరోగ్యానికి ఈ రెండు పరిస్థితులు ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో, వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం
మొదటగా, సామాజిక ఏకాంతం (Social Isolation) అంటే ఎవరికీ అందుబాటులో లేకుండా, ఇతరులతో ఎలాంటి సంబంధాలు లేకుండా భౌతికంగా దూరంగా ఉండటం. ఉదాహరణకు ఎవరితోనూ మాట్లాడకుండా గదికే పరిమితం కావడం. దీనివల్ల సమాజంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి.
మరోవైపు ఒంటరితనం (Loneliness) అనేది ఒక మానసిక భావన. పది మంది మధ్యలో ఉన్నా, మనసులో ఎవరూ తోడులేరనే భావన కలగడం. మన చుట్టూ ఎంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, మన భావాలను పంచుకోవడానికి సరైన వ్యక్తి లేరనిపించినప్పుడు ఈ లోన్లీనెస్ కలుగుతుంది. అంటే సామాజిక ఏకాంతం అనేది భౌతికమైన స్థితి అయితే, ఒంటరితనం అనేది ఒక మానసిక అనుభూతి.
ఈ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీని నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
మొదట మనసుకు నచ్చిన పనులపై దృష్టి పెట్టాలి. కొత్త హాబీలను అలవాటు చేసుకోవడం, పుస్తకాలు చదవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేయాలి. మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, పాత స్నేహితులతో మనసు విప్పి మాట్లాడటం, వారితో సమయం గడపడం మంచిది. సమాజంలో జరిగే వివిధ రకాల యాక్టివిటీస్ లేదా వాలంటీర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించి, నిజ జీవితంలో మనుషులతో మమేకం కావడం చాలా ముఖ్యం. ఒంటరితనం అనేది శాశ్వతం కాదు, సరైన మార్పులతో దీనిని సులభంగా జయించవచ్చు.

