Tea and Samosa Combo: చాయ్ - సమోసా కాంబినేషన్ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!
ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

Tea and Samosa Combo: సాయంత్రం అయిందంటే చాలు.. ఆఫీస్ బయట టీ బంక్ దగ్గరో, లేదా ఇంట్లోనే వేడి వేడి చాయ్ తాగుతూ, కరకరలాడే సమోసా తినడం మనలో చాలా మందికి ఒక అలవాటు. వర్షం పడినా, స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలన్నా ఈ కాంబినేషన్ సూపర్ హిట్. కానీ, నాలుకకు ఎంతో రుచిగా అనిపించే ఈ 'సమోసా-చాయ్' కాంబినేషన్.. మన శరీరానికి ఒక స్లో పాయిజన్‌లా మారుతుందని మీకు తెలుసా? అవును, వైద్య నిపుణులు ఈ కాంబినేషన్ గురించి షాకింగ్ నిజాలు చెప్తున్నారు.
జీర్ణవ్యవస్థపై ప్రభావం :
అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే.. సమోసాను మైదా పిండితో తయారు చేస్తారు, పైగా దీనిని నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. మైదా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనికి తోడు మనం తాగే టీలో 'కెఫీన్' 'టా నిన్స్' (Tannins) వంటి రసాయనాలు ఉంటాయి. ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసిన సమోసాతో పాటు టీ మన కడుపులోకి వెళ్తుందో, అది జీర్ణక్రియ ప్రక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. దీనివల్ల తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు తక్షణమే తలెత్తుతాయి.
పోషకాల లోపం & బరువు పెరగడం:
చాలా మందికి తెలియని మరో నిజం ఏంటంటే.. టీలో ఉండే టా నిన్స్ మన శరీరం ఇతర ఆహారాల నుండి ఐరన్ (Iron), క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల మీరు ఎంత మంచి ఆహారం తిన్నా శరీరానికి అబ్బదు. ఇక క్యాలరీల విషయానికి వస్తే.. సమోసాలో బ్యాడ్ కొలెస్ట్రాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. చాయ్‌లో చక్కెర ఉంటుంది. ఈ రెండూ కలిసి శరీరంలో మెటబాలిజాన్ని దెబ్బతీసి, అతి త్వరగా బరువు పెరిగేలా (Obesity) చేస్తాయి. రోజూ ఈ అలవాటు ఉంటే బెల్లీ ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోతుంది.
దీర్ఘకాలిక రోగాల ముప్పు
ఇది కేవలం గ్యాస్ సమస్యతోనే ఆగిపోదు. క్రమంగా ఈ అలవాటు రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) పెంచుతుంది, దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి, భవిష్యత్తులో గుండె జబ్బులు (Heart Diseases) మరియు హై బీపీకి కారణమవుతుంది. బయట హోటల్స్‌లో ఒకే నూనెను పదే పదే మరిగించి సమోసాలు వేస్తుంటారు, ఇది క్యాన్సర్ కారకాలను (Toxins) కూడా శరీరంలోకి చేరవేస్తుంది.

