Meditation and Workouts: మన రోజువారీ జీవితంలో వ్యాయామం, ధ్యానం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, ఒక పక్కా టైమింగ్‌లో చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మీకు తెలుసా? ముఖ్యంగా మెడిటేషన్ చేసే సమయం మన శరీరానికి, మనసుకి అందే శక్తిని నిర్ణయిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సూర్యోదయానికి రెండున్నర గంటల ముందు సమయం మెడిటేషన్‌కు అత్యంత అనుకూలమైనది. ఆ సమయంలో సూర్యుడు భూమికి 60 డిగ్రీల కోణంలో ఉంటాడు. అప్పుడు వెలువడే శక్తి మనలో ఏకాగ్రతను పెంచడానికి, విశ్వంలో ఉన్న శక్తితో మనల్ని అనుసంధానించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య సమయాన్ని 'మ్యాజిక్ అవర్స్' అని పిలుస్తారు. ఈ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా యూనివర్స్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వొచ్చు.

చాలామంది మెడిటేషన్ ముందు చేయాలా లేక వ్యాయామం తర్వాతా అని సందేహిస్తుంటారు. నిజానికి మెడిటేషన్ కంటే ముందు వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికగా బలం పెరుగుతుంది. వర్కవుట్స్ తర్వాత ఒక పావుగంట పాటు ధ్యానం చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఒత్తిడి తగ్గి బ్రెయిన్ పవర్ కూడా మెరుగుపడుతుంది. ఇది మీ రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.

మెడిటేషన్ సరిగ్గా చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రశాంతమైన చోటును ఎంచుకోవాలి. ఫోన్ వంటి గాడ్జెట్లను దూరంగా పెట్టాలి. రోజూ ఒకే టైమ్‌లో మెడిటేషన్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. కూర్చునే విధానం (Posture) కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. మొదట్లో తక్కువ సేపు చేసి, మెల్లగా టైమ్ పెంచడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story