ఏం తినకూడదు?

Monsoon Diet Rules: వర్షాకాలం వచ్చేసింది. వేడి వేడి వాతావరణం చల్లబడటంతో అందరికీ ఎంతో హాయిగా ఉంటుంది. కానీ, ఈ సీజన్‌లోనే మన రోగనిరోధక శక్తి (Immunity) కాస్త తగ్గుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే, ఈ కాలంలో మనం తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం
మొదటగా వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
మీ వంటల్లో అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు జీలకర్ర వంటి మసాలా దినుసులను ఎక్కువగా వాడండి. ఇవి సహజసిద్ధమైన యాంటీ-బయాటిక్స్‌లా పనిచేసి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి.
అలాగే, విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, నారింజ, మోసంబి వంటి పండ్లను డైట్‌లో చేర్చుకోండి.
ఈ సీజన్‌లో జీర్ణశక్తి మందగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ వేడిగా, సులభంగా అరిగే ఆహారాన్ని మాత్రమే తినాలి.
రాత్రి పూట కిచిడీ, ఓట్స్, లేదా వేడి వేడి వెజిటబుల్ సూప్స్ తాగడం వల్ల శరీరానికి హాయిగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది.
అలాగే, రోజూ గోరువెచ్చని నీటిని మాత్రమే తాగడం అలవాటు చేసుకోండి. ఇది గొంతు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
వేటికి దూరంగా ఉండాలంటే...
బయట దొరికే రోడ్ సైడ్ ఫుడ్, చాట్స్, ఫ్రైడ్ ఐటమ్స్‌కు వీలైనంత దూరంగా ఉండండి.
అలాగే, ఆకుకూరలు ,కూరగాయలను వండే ముందు ఉప్పు నీటిలో బాగా కడిగి, పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. ఎందుకంటే వర్షాకాలంలో వీటిపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కట్ చేసి పెట్టిన పండ్లను అస్సలు తినకండి.

