ఇంట్లోనే అద్భుతమైన ఫేషియల్ గ్లో!

Mustard Oil for Glowing Skin: అందం అంటే కేవలం మేకప్ మాత్రమే కాదు.. లోపలి నుండి చర్మం ఆరోగ్యంగా మెరవడమే నిజమైన అందం. కానీ నేటి బిజీ లైఫ్, పొల్యూషన్ వల్ల మన చర్మం తరచూ నిర్జీవంగా మారుతుంటుంది. మరి ఖరీదైన క్రీములు లేకుండా, ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో మెరిసే చర్మాన్ని ఎలా పొందాలో మీకు తెలుసా? మన వంటింట్లో ఉండే ఆవనూనె , కొబ్బరి నూనె కలిస్తే అది చర్మానికి ఒక అద్భుతమైన వరంగా మారుతుంది.

కొద్దిగా ఆవనూనెను తీసుకుని, దానికి సమానంగా కొబ్బరి నూనెను కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముఖానికి సహజమైన కాంతిని ఇవ్వడమే కాకుండా, మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. చర్మంపై ఉండే మలినాలను శుభ్రం చేసి, రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తుంది.

ఒకవేళ మీ చర్మం కళావిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తోందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి. పావుకప్పు ఆవనూనెను తీసుకుని, అందులో కేవలం రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలపాలి. దీనికి ఒక చెంచా బియ్యప్పిండిని చేర్చి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమం చర్మ సౌందర్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

ఈ పేస్ట్‌ను ఒంటికి రాసుకుని నలుగులా మృదువుగా రుద్దుకోవాలి. ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను పూర్తిగా తొలగించి, కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. ఫలితంగా మెరిసే ఛాయ మీ సొంతమవుతుంది. కెమికల్స్ లేని ఈ సహజ చిట్కాతో మీ చర్మాన్ని మరింత తాజాగా, కాంతివంతంగా మార్చుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story