Facial Glow at Home with Raw Milk: పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..ఇంట్లోనే పచ్చి పాలతో "ఫేషియల్ గ్లో"!
ఇంట్లోనే పచ్చి పాలతో "ఫేషియల్ గ్లో"!

Facial Glow at Home with Raw Milk: అందంగా కాంతివంతంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ నేటి బిజీ లైఫ్, కాలుష్యం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. అయితే, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరం లేకుండా, మన వంటింట్లో దొరికే పచ్చి పాలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు. పచ్చి పాలు చర్మానికి మంచి క్లెన్సర్‌గా, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. మరి ఆ ప్యాక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పచ్చి పాలు, తేనె కలిపి చేసే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. కొద్దిగా పచ్చి పాలు తీసుకుని అందులో తగినంత తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివరిగా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా, సహజమైన మెరుపును సంతరించుకుంటుంది.
ఇక చర్మానికి మరింత మేలు చేసే మరో అద్భుతమైన ప్యాక్.. పచ్చి పాలు, అరటి పండు మిశ్రమం. దీనికోసం సగం అరటి పండును తీసుకుని మెత్తగా పేస్ట్‌లా చేయాలి. అందులో కొద్దిగా పచ్చి పాలు కలిపి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో కడిగేయండి. అరటి పండులో ఉండే విటమిన్లు, పాలలోని ప్రోటీన్లు కలిసి చర్మ కణాలను లోపలి నుండి శుభ్రం చేసి, ముఖాన్ని ఫ్రెష్‌గా మారుస్తాయి.

