Real Reason Behind Air Conditioner Explosions: ఎండకాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు ఉపశమనం ఇచ్చే ఏకైక మార్గం ఏసీ. కానీ, మనకు చల్లదనాన్ని ఇచ్చే అదే ఏసీలు.. అప్పుడప్పుడు ప్రాణాంతక బాంబుల్లా మారుతున్నాయి. ఇటీవల నగరాల్లో ఏసీలు పేలిపోతున్న ఘటనలు చూస్తుంటే గుండె జల్లుమంటోంది. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? నిపుణులు చెబుతున్న కారణాలేంటి? మనం ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీలు పేలిపోవడానికి ప్రధాన శత్రువు 'ఓవర్ హీటింగ్'. బయట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినప్పుడు ఏసీ కంప్రెసర్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనికి తోడు గంటల తరబడి విరామం లేకుండా వాడటం వల్ల లోపలి భాగాలు వేడెక్కి మంటలు చెలరేగుతాయి. ముఖ్యంగా అవుట్ డోర్ యూనిట్లను గాలి ఆడని ఇరుకైన చోట పెడితే.. ఆ వేడి గాలి బయటకు వెళ్లలేక కంప్రెసర్ పేలిపోతుంది. మరో డేంజర్.. రెఫ్రిజిరెంట్ గ్యాస్ లీకేజీ. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చే చిన్న స్పార్క్ తగిలినా.. అది భారీ పేలుడుకు దారితీస్తుంది.

నాసిరకం వైరింగ్, లూజ్ కనెక్షన్లు కూడా ముప్పే! ఏసీ ప్లగ్ పాయింట్ వద్ద ఇతర భారీ పరికరాలను వాడితే ఓవర్ లోడ్ అయి వైర్లు కాలిపోతాయి. ఓల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండే చోట స్టెబిలైజర్ లేకపోతే ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డులు కాలిపోతాయి. అలాగే, ఏసీని సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతుంది. దీనివల్ల గాలి ప్రసరణ తగ్గి, కంప్రెసర్ కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా అది వేడెక్కి ప్రమాదం సంభవిస్తుంది.

ఏసీ ప్రమాదానికి ముందు కొన్ని సంకేతాలిస్తుంది. ఏసీ నుంచి వింత శబ్దాలు రావడం, ఏదైనా కాలిన వాసన రావడం, గది సరిగ్గా చల్లబడకపోవడం లేదా ఏసీ వేసిన వెంటనే ఎంసీబీ (MCB) ట్రిప్ అవ్వడం వంటివి జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. ఇండోర్ లేదా అవుట్ డోర్ యూనిట్ల నుంచి గాలి లీక్ అవుతున్న శబ్దం వస్తే.. అది గ్యాస్ లీకేజీ కావచ్చు. అప్పుడు ఏసీని వెంటనే ఆపేసి టెక్నీషియన్‌ను పిలవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story