Rushing Through Breakfast Every Morning: ఉదయం లేచింది మొదలు.. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లాలనే కంగారు. చేతిలో టైం చూస్తేనేమో తక్కువగా ఉంటుంది. దాంతో చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? ప్లేట్లో ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ను నమలకుండా, మింగేస్తూ హడావుడిగా ముగించేస్తారు. మరికొందరైతే కార్లలోనో, బస్సుల్లోనో వెళ్తూ ప్రయాణంలో తింటుంటారు. మరి ఇంత హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల మన శరీరానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో మీకు తెలుసా?

మనం ఆహారాన్ని నోట్లోనే బాగా నమిలి తినాలి. అలా కాకుండా హడావుడిగా మింగేయడం వల్ల జీర్ణక్రియ (Digestion) పూర్తిగా దెబ్బతింటుంది. ఆహారం సరిగ్గా నలగకపోతే.. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తక్షణమే తలెత్తుతాయి. అంతేకాదు, మన మెదడుకు "కడుపు నిండింది" అనే సిగ్నల్ వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. మనం హడావుడిగా తిన్నప్పుడు ఆ సిగ్నల్ అందక.. అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఇది కాస్తా కాలక్రమేణా ఊబకాయం లేదా బరువు పెరగడానికి (Weight Gain) దారితీస్తుంది.

సమస్య అక్కడితోనే ఆగదు. హడావుడిగా తినడం వల్ల ఆహారంలోని పోషకాలను (Nutrients) మన శరీరం పూర్తిగా గ్రహించలేదు. దీనివల్ల తిన్నప్పటికీ రోజంతా నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. రోజువారీగా ఇలా కంగారుగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar Levels) అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో డయాబెటిస్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట తినే అల్పాహారమే రోజంతటికీ మనకు ఇంధనం లాంటిది. అందుకే, ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక 15 నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించడం బెటర్.

Next Story