అయితే జాగ్రత్త!

Scratched Non-stick Pan: మన కిచెన్‌లో వంట పనిని సులభతరం చేసే నాన్-స్టిక్ పాత్రలు.. ఇప్పుడు మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయా? నూనె తక్కువ పడుతుందని, క్లీన్ చేయడం ఈజీ అని మనం వాడుతున్న ఈ పాన్‌లు.. నిజానికి ఒక నిశ్శబ్ద శత్రువు అని మీకు తెలుసా? దీనిపై తాజాగా డాక్టర్లు , పరిశోధకులు వెల్లడిస్తున్న నిజాలు వింటే మీరు షాక్ అవుతారు.

సాధారణంగా నాన్-స్టిక్ పాత్రలకు ఉండే ఆ స్మూత్ కోటింగ్‌ను 'టెఫ్లాన్' అంటారు. ఈ కోటింగ్ తయారీలో PFAS వంటి 'ఫరెవర్ కెమికల్స్' (Forever Chemicals) ఉపయోగిస్తారు. ఇవి మన శరీరంలోకి ఒకసారి చేరితే.. అవి బయటకు పోవడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. అందుకే వీటిని 'శాశ్వత టాక్సిక్ కెమికల్స్' అని పిలుస్తారు. మనం ఈ పాత్రలను వేడి చేసినప్పుడు లేదా గరిటెలతో రుద్దినప్పుడు, ఆ కెమికల్స్ నేరుగా మనం తినే ఆహారంలో కలిసిపోతున్నాయి.

మీ ఇంట్లో ఉన్న నాన్-స్టిక్ పాన్‌పై చిన్న గీత పడిందా? జాగ్రత్త. ఎందుకంటే ఒక అధ్యయనం ప్రకారం.. టెఫ్లాన్ కోటెడ్ పాత్రలపై కేవలం ఒక్క చిన్న గీత పడితే చాలు.. వంట చేసే సమయంలో అవి దాదాపు 9 వేలకు పైగా మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయి. మన కంటికి కూడా కనిపించని ఈ సూక్ష్మ కణాలు మనం తినే ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నాయి.

ఈ కెమికల్స్ రక్తంలో చేరడం వల్ల భయంకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా కిడ్నీ, కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీనివల్ల సంతానలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.గర్భిణీలు ఇలాంటి పాత్రల్లో వండిన ఆహారం తింటే, పుట్టబోయే బిడ్డల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story