Snacks: సర్వేలో షాకింగ్ నిజాలు:స్నాక్స్‌లో భారతీయులు ఏం కోరుకుంటున్నారో తెలుసా?
ఏం కోరుకుంటున్నారో తెలుసా?

Snacks: ఒకప్పుడు స్నాక్స్ అంటే.. కేవలం సమోసాలు, చిప్స్, లేదా బజ్జీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు భారతీయుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. మన దేశ ప్రజలు ఇప్పుడు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూస్తున్నారు. తాజాగా వెలువడిన 'ఫార్మ్‌లీ హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్ 2026' (Farmley Healthy Snacking Report 2026) సర్వేలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. దాదాపు 6,000 మందిపై జరిపిన ఈ సర్వే.. భారతీయుల సరికొత్త ఈటింగ్ ట్రెండ్స్‌ను బయటపెట్టింది.
'ప్రోటీన్ క్రేజ్
గతంలో ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కి వెళ్లేవారో, బాడీ బిల్డర్లో మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా స్నాక్స్ కొనేటప్పుడు అందులో ప్రోటీన్ ఎంత ఉందో చెక్ చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 86 శాతం మంది ప్రోటీన్ ఆధారిత స్నాక్స్‌కే ఓటేశారు. అంతేకాదు, వాటికోసం 32 శాతం మంది అదనంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు.
క్లీన్ లేబుల్స్ అండ్ పారదర్శకత.
టీవీల్లో వచ్చే రంగురంగుల యాడ్స్ లేదా పెద్ద సెలబ్రిటీల ప్రచారాలను చూసి జనం ఇప్పుడు మోసపోవడం లేదు. 62 శాతం మంది వినియోగదారులు.. తాము కొనే స్నాక్ ప్యాకెట్ వెనుక ఉండే 'పదార్థాల జాబితా' (Ingredients List) చదివి, ఏమేం వాడారో తెలుసుకున్నాకే బ్రాండ్లను నమ్ముతున్నారు.
పీరియడ్స్ ఫ్రెండ్లీ స్నాక్స్
మహిళల ఆరోగ్యం, వారి పోషకాహార అవసరాలకు మార్కెట్ ఇప్పుడు పెద్దపీట వేస్తోంది. నెలసరి లేదా పీరియడ్స్ సమయంలో శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్లు ,శక్తిని ఇచ్చే ప్రత్యేకమైన స్నాక్స్ కొనుగోలు చేయడానికి 52 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు, తెల్ల చక్కెరకు (Refined Sugar) భారతీయులు బై-బై చెప్పేస్తున్నారు. సర్వే ప్రకారం 33 శాతం మంది రిఫైన్డ్ షుగర్ ఉన్న తిండికి పూర్తిగా దూరంగా ఉంటుండగా.. 61 శాతం మంది బెల్లం (Jaggery) లేదా ఖర్జూరం (Dates) వంటి సహజ సిద్ధమైన తీపితో చేసిన స్నాక్స్ తినడానికే ఇష్టపడుతున్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే ఆర్టిఫిషియల్ లేదా జీరో క్యాలరీ స్వీటెనర్ల వైపు వెళ్తున్నారు.
ఇక పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అస్సలు రాజీ పడటం లేదు. సుమారు 60 శాతం మంది పేరెంట్స్.. తమ పిల్లల కోసం కెమికల్స్ లేని, ఆర్గానిక్, హెల్తీ స్నాక్స్ కొనేందుకు ఎంత ధర అయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు.

