Struggling with Constipation: వాతావరణంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం ఒకటి. ఇది కేవలం కడుపుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు... దీనివల్ల రోజంతా నీరసం, అలసట, తీవ్రమైన అసౌకర్యం వెంటాడుతుంటాయి.

అయితే సరైన ఆహార నియమాలు, కొన్ని సులభమైన జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్య నుండి ఎలా బయటపడవచ్చో నిపుణులు వివరిస్తున్నారు.

అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది?

వేసవి లేదా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. ఈ సమయంలో తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అప్పుడు మన శరీరం జీర్ణవ్యవస్థలోని నీటిని గ్రహిస్తుంది. దీనివల్ల మలం గట్టిపడి, మలవిసర్జన కష్టంగా మారుతుంది.

మలబద్ధకం యొక్క ముఖ్య లక్షణాలు:

వారానికి మూడు కంటే తక్కువ సార్లు మాత్రమే మలవిసర్జన జరగడం.

మలం గట్టిగా, పొడిగా మారడం.

మలవిసర్జన సమయంలో విపరీతంగా ముక్కవలసి రావడం.

కడుపు ఉబ్బరం, అసిడిటీ, కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన.

ఆకలి లేకపోవడం మరియు శరీరం ఎప్పుడూ నీరసంగా ఉండటం.

సమస్య పెరగడానికి ప్రధాన కారణాలు..

నీటి కొరత: శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు అందకపోవడం.

పీచుపదార్థం లోపం: ఆహారంలో పండ్లు, ఆకుకూరలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడం.

జంక్ ఫుడ్స్:

నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం:

ఎండల వల్ల చాలా మంది వ్యాయామం, వాకింగ్ వంటి అలవాట్లను పక్కన పెట్టేస్తారు. ఇది కూడా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

మలబద్ధకం నుండి ఉపశమనం పొందే మార్గాలు..

వైద్యుల నిపుణుల అభిప్రాయం ప్రకారం..

ఈ క్రింది సులభమైన చిట్కాలను పాటిస్తే మలబద్ధకం సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు..

పుష్కలంగా నీరు తాగాలి: ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.

నీటి శాతం ఉన్న ఆహారాలు:

పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి పండ్లు మరియు మజ్జిగను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం:

ఆకుకూరలు, తృణధాన్యాలు, పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

వీటికి దూరంగా ఉండాలి:

జంక్ ఫుడ్స్, మితిమీరిన కాఫీ, టీ తాగే అలవాట్లను తగ్గించుకోవాలి.

సమయపాలన:

ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తినే అలవాటును అలవర్చుకోవాలి.

వ్యాయామం & నిద్ర:

ఎండ తక్కువగా ఉన్న సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం మరియు రాత్రి వేళల్లో తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story