Suffering from Constipation: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, సరిపడా నీళ్లు తాగకపోవడం మరియు శారీరక శ్రమ తగ్గడం వల్ల

మలబద్ధకం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. ఉదయాన్నే కడుపు సరిగ్గా శుభ్రపడకపోతే రోజంతా నీరసం, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, ఆకలి కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మందులపై ఆధారపడకుండా, కొన్ని సహజమైన చిట్కాలు మరియు జీవనశైలి మార్పుల ద్వారా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణులు సూచిస్తున్న కొన్ని సహజ నివారణలు..

రాతిరి వేళ త్రిఫల చూర్ణం:

ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, ఉదయాన్నే విసర్జన సులభమవుతుంది.

ఉదయాన్నే గోరువెచ్చని నీరు & నిమ్మరసం:

పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగవుతాయి.

పీచు పదార్థాలు (ఫైబర్) కలిగిన ఆహారం:

ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని పెంచాలి. బొప్పాయి, జామ, అరటిపండ్లు, ఓట్స్, ఆకుకూరలు, ధాన్యాలు, రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష, అంజీర్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.

సరిపడా నీరు:

రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండి మలం గట్టిపడకుండా ఉంటుంది.

క్రమం తప్పని వ్యాయామం:

రోజువారీ జీవితంలో 20 నుంచి 30 నిమిషాల పాటు నడవటం, యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు..

రోజువారీ ఆహారాన్ని సరైన సమయానికి తినే అలవాటు చేసుకోవాలి. ఉదయం టిఫిన్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మరియు మేదాతో చేసిన పదార్థాలను తగ్గించాలి.

గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకూ ఒకసారి లేచి 5 నిమిషాలు నడవాలి.

ఆముదం వంటివి వాడేముందు లేదా సుదీర్ఘకాల సమస్యల కోసం తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

వారానికి పైగా ఈ సమస్య కొనసాగినా, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, హఠాత్తుగా బరువు తగ్గడం లేదా మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story