The Secret to Better Health: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. వ్యాయామం చేయడానికి సమయం లేదు అని సాకులు చెప్పే వారికి ఆరోగ్య నిపుణులు ఒక చక్కని పరిష్కారం చూపుతున్నారు. జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేకుండా, రోజుకు కేవలం 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజూ అరగంట పాటు వాకింగ్ చేయడం వల్ల కలిగే టాప్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది

రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని, అధిక రక్తపోటు సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

బరువు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల

బరువు తగ్గాలని అనుకునే వారికి నడక ఒక సహజమైన ఔషధం. రోజూ అరగంట వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి, ఊబకాయం బారిన పడకుండా ఉండొచ్చు. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మధుమేహం కంట్రోల్

ప్రస్తుత కాలంలో సైలెంట్ కిల్లర్‌గా మారిన టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి నడక ఎంతో సహాయపడుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

మానసిక ఉల్లాసం, ఒత్తిడి దూరం

నడక అనేది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు శరీరంలో 'ఎండార్ఫిన్లు' అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రోజంతా ఉండే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించి, మీ మూడ్‌ను ఇన్స్టంట్‌గా మార్చేస్తాయి.

ఎముకలు, కండరాల బలం

వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులను నివారించడంలో నడక కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల కాళ్ల కండరాలు, ఎముకలు ధృడంగా మారతాయి. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.

నిపుణుల చిన్న సూచన..

వాకింగ్ ప్రారంభించే వారు ఒకేసారి ఎక్కువ దూరం నడవకుండా, మొదట సాధారణ వేగంతో ప్రారంభించి ఆ తర్వాత వేగాన్ని పెంచాలి. వీలైతే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది

PolitEnt Media

PolitEnt Media

Next Story