Throwing Away Jackfruit Seeds: పనస గింజలను పారేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!
ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!

Throwing Away Jackfruit Seeds: పనస పండు.. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, చాలామంది పనస తొనలను ఎంతో ఇష్టంగా తిని, వాటి లోపల ఉండే గింజలను మాత్రం పారేస్తూ ఉంటారు. కానీ, ఆ పనస గింజల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషక విలువలు దాగున్నాయని మీకు తెలుసా? ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పనస గింజల్లో ఫైబర్ అంటే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి పనస గింజలు ఒక మంచి ఔషధంలా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు పెరిగి, పొట్ట సమస్యలు దూరమవుతాయి.
గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా.. రక్తహీనత తగ్గాలన్నా పనస గింజలు ఎంతో తోడ్పడతాయి. వీటిలో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎనీమియా లేదా రక్తహీనత సమస్య దరిచేరదు. అంతేకాదు, ఈ గింజల్లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. పైగా, ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతుంది.
వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో పనస గింజలు సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. అలాగే, ఇందులోని విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, తరచూ వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది.

