Troubled by Eyebrow Dandruff: చుండ్రు అనగానే మనలో చాలా మందికి తల గుర్తుకొస్తుంది. కానీ, తలకే కాదు.. కనుబొమ్మలకు కూడా చుండ్రు వస్తుంది. కనుబొమ్మల చుట్టూ చర్మం పొడిబారడం, తెల్లటి పొలుసులు రాలడం, విపరీతమైన దురద ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. అది కేవలం మురికి అనుకుంటే పొరపాటే, అది కనుబొమ్మల చుండ్రు! మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

కారణాలు, మొదటి చిట్కా - బాదం నూనె"కలర్స్‌, కెమికల్స్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడడం వల్ల, లేదా చర్మం చాలా పొడిగా మారడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని నివారించడానికి రాత్రి పడుకునే ముందు కొద్దిగా బాదం నూనెను గోరువెచ్చగా చేసి, కనుబొమ్మలపై సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రెండో చిట్కా - టీ ట్రీ ఆయిల్ & కొబ్బరి నూనె"అలాగే, ఒక గిన్నెలో ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ తీసుకుని, అందులో పన్నెండు చుక్కల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ కనుబొమ్మలకు రాస్తుంటే.. చుండ్రును తగ్గించే యాంటీ-ఫంగల్ గుణాలు దీనికి రక్షణ కల్పిస్తాయి. ఇక వేప నూనెను రోజుకు రెండుసార్లు రాసుకున్నా నాలుగు రోజుల్లోనే చుండ్రు మాయమవుతుంది.

మూడో చిట్కా - కలబంద, మెంతులు"వీటితో పాటు, కాస్త తాజా కలబంద గుజ్జును కనుబొమ్మలకు పట్టించి పావుగంట తరువాత కడిగేయాలి. లేదా రాత్రంతా నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్ రాసుకున్నా చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు, కనుబొమ్మలు కూడా ఒత్తుగా మారుతాయి.

ఈ సమస్య ఉన్నప్పుడు కనుబొమ్మలపై ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడకపోవడమే మంచిది. తగినన్ని నీళ్లు తాగుతూ, విటమిన్-సి ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్యకు శాశ్వతంగా దూరంగా ఉండొచ్చు!

PolitEnt Media

PolitEnt Media

Next Story