Using a Treadmill to Lose Weight: బరువు తగ్గడానికి ట్రెడ్మిల్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఈ తప్పులు అస్సలు చేయకండి!

Using a Treadmill to Lose Weight: ఈ రోజుల్లో బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా మారాలన్నా చాలామంది ఎంచుకునే బెస్ట్ ఆప్షన్... 'ట్రెడ్మిల్'. జిమ్‌కి వెళ్లినా, ఇంట్లోనే వర్కవుట్ ప్లాన్ చేసుకున్నా ట్రెడ్ మిల్‌పై వాకింగ్, రన్నింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ట్రెడ్మిల్ ఎక్కేసి స్పీడ్ పెంచేస్తే సరిపోతుందా? అంటే... అస్సలు కాదు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
తెలిసో తెలియకో ట్రెడ్మిల్ ఉపయోగించేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆశించిన ఫలితం రాకపోగా... కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల గాయాల బారిన పడే ప్రమాదం ఉంది. మరి ట్రెడ్మిల్‌పై వర్కవుట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
తొందరగా బరువు తగ్గిపోవాలనే కంగారుతో ట్రెడ్ మిల్ ఎక్కొద్దు. పూర్తిగా మనసు పెట్టి కనీసం 20 నుండి 40 నిమిషాల పాటు రన్నింగ్ చేయాలి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది.
వామప్ అస్సలు స్కిప్ చేయొద్దు. ట్రెడ్ మిల్ ఎక్కడానికి ముందు కచ్చితంగా వామప్ చేయాలి. లేకపోతే రన్నింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే పరిగెత్తే వేగం కూడా తగ్గుతుంది.
పెద్ద అడుగులు వేయకండి. ట్రెడ్ మిల్‌పై పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడం లేదా పరిగెత్తడం వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి, ఇంజ్యూరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది.
కిందకు చూడకండి. రన్నింగ్ చేస్తున్నప్పుడు పదేపదే కాళ్లను చూసుకుంటే బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి, స్ట్రెయిట్‌గా చూస్తూ రన్ చేయాలి.
అలాగే చాలామంది రన్నింగ్ బెల్ట్‌కు మరీ ముందుకీ లేదా మరీ వెనక్కీ పరిగెత్తుతుంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వర్కవుట్ చేసేటప్పుడు ట్రెడ్ మిల్ సైడ్ బార్స్‌ను అస్సలు పట్టుకోవద్దు. చేతులను ఫ్రీగా కదిలిస్తూ బాడీ పోశ్చర్ కరెక్ట్‌గా ఉంచితేనే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి.
ట్రెడ్ మిల్ ఒకే రకమైన వర్కవుట్‌కే అనుకుంటారు, కానీ ట్రైనర్ సాయంతో దీనిపై వెరైటీ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్... ట్రెడ్ మిల్‌పై రన్ చేసేందుకు ఎప్పుడూ కంఫర్ట్‌గా ఉండే రన్నింగ్ షూస్ మాత్రమే వాడండి.

