Happy Married Life: పెళ్లి అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల బంధం, ఒక కొత్త జీవితానికి పవిత్రమైన నాంది. హిందూ సంస్కృతిలో వివాహ బంధానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పెళ్లైన కొత్తలో నూతన వధూవరులు తీసుకునే కొన్ని నిర్ణయాలు, పాటించే కొన్ని సాంప్రదాయాలు వారి జీవితాంతం సుఖసంతోషాలతో ఉండటానికి పునాది వేస్తాయి. మరి కొత్తగా పెళ్లైన జంటలు తమ కాపురం పచ్చగా సాగడానికి చేయాల్సిన ఆ మొదటి పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లయ్యాక కొత్త జంట చేయాల్సిన మొదటి పని.. తమ కులదైవాన్ని దర్శించుకోవడం లేదా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడం. పెళ్లి తర్వాత వధువు లక్ష్మీదేవి స్వరూపంగా అత్తగారి ఇంట్లో అడుగుపెడుతుంది. అందుకే ఇంటి సింహద్వారం వద్ద ప్రమిదలు వెలిగించడం, కొత్త కోడలితో ఇంట్లో దీపారాధన చేయించడం వల్ల ఆ ఇల్లు లక్ష్మీకటాక్షంతో విరాజిల్లుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజా మందిరంలో కూర్చుని, సంతోషకరమైన భవిష్యత్తు కోసం దేవుడిని ప్రార్థించాలి. దీనివల్ల వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.

జీవితం సజావుగా సాగాలంటే దైవానుగ్రహంతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా ఎంతో ముఖ్యం. పెళ్లైన వెంటనే ఇరువైపుల ఉన్న పెద్దల పాదాలకు నమస్కరించి వారి దీవెనలు తీసుకోవాలి. పెద్దల మనసు సంతోషపడితే, ఆ హృదయాల నుండి వచ్చే ఆశీర్వాదం కొత్త జంటను ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

కేవలం ఆధ్యాత్మిక పనులే కాదు, ఇద్దరి మధ్య అవగాహన పెరగడానికి కొత్త వాతావరణాన్ని అలవర్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, చిన్న చిన్న పొరపాట్లను సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అలాగే జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కొత్త జంటలు తమ జీవితం నిత్య నూతనంగా, పచ్చగా సాగడానికి ఏదైనా గుడిలో లేదా ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటడం చాలా మంచిది. వీలైతే పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల నూతన దంపతుల జాతకంలోని దోషాలు తొలగిపోయి, జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story