Cook Faster: వంట పని త్వరగా అవ్వాలా? ఈ 8 కిచెన్ సీక్రెట్స్ మీకు తెలిస్తే టైం అస్సలు వేస్ట్ అవ్వదు!
టైం అస్సలు వేస్ట్ అవ్వదు!

Cook Faster: ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయనిదే ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో మహిళలు అటు ఆఫీస్ పనిని, ఇటు వంట పనిని బ్యాలెన్స్ చేస్తూ సతమతమవుతుంటారు. ఓ పక్క పిల్లలకు బాక్స్ సర్దడం.. వాళ్లను స్కూల్‌కి పంపడం.. భర్త అవసరాలు చూసుకోవడం.. తాను ఆఫీస్‌కి టైంకి తయారవడం.. అబ్బా! ఉదయాన్నే ఇల్లాలికి ఇదొక పెద్ద యుద్ధమే! ఇక ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే సమయానికి వంట కాకపోతే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
మరి ఇంత హడావిడిలో వంట పని త్వరగా పూర్తి కావాలంటే.. ఈ స్మార్ట్ కిచెన్ టిప్స్ ఫాలో అవ్వండి
టిప్ 1: కూరల్లో ఆలుగడ్డలు త్వరగా ఉడకాలంటే.. ఉడికించే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయండి. దీనివల్ల పొట్టు కూడా చాలా తేలిగ్గా వస్తుంది. లేదా వండడానికి ముందే ఉప్పు నీళ్లలో ఆలుగడ్డ ముక్కల్ని ఓ ఇరవై నిమిషాలు నానబెడితే.. అవి చకచకా ఉడికిపోతాయి.
టిప్ 2: పచ్చి బఠాణీలు వండినప్పుడు రంగు మారిపోతున్నాయా? అయితే వాటిని ఉడికించేటప్పుడు కొద్దిగా చక్కెర (పంచదార) వేయండి.. అప్పుడు అవి మంచి పచ్చని రంగులో, చూడ ముచ్చటగా ఉంటాయి.
టిప్ 3: పిల్లల కోసం నూడుల్స్, పాస్తా లాంటివి చేసినప్పుడు.. అవి ఉడికిన వెంటనే కాసేపు చల్లటి నీళ్లలో ఉంచితే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
టిప్ 4: సాయంత్రం స్నాక్స్ కోసం పకోడీలు చేసేటప్పుడు.. అవి కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే శెనగపిండిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలపడం మర్చిపోకండి.
టిప్ 5: కూరల్లో వేసే మసాలాలు మంచి రంగు, రుచి ఇవ్వాలంటే.. మసాలా దినుసుల్ని ఎప్పుడూ హై ఫ్లేమ్‌లో కాకుండా, సన్నని మంటపై దోరగా వేగించి ఆ తర్వాతే మిక్సీ పట్టాలి.
టిప్ 6: ఇక వర్కింగ్ ఉమెన్స్ ముందే చేసి పెట్టుకునే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు ఎక్కువ రోజులు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉండాలంటే.. అందులో ఒక టీ స్పూన్ వేడి నూనె వేసి కలపండి.
టిప్ 7: అన్నం ముద్దగా కాకుండా హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా రావాలనుకుంటే.. అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ నూనె వేయండి.

