Stay Energetic and Active All Day: ఉదయం లేచిన సమయం మనం ఆ రోజంతా ఎలా గడుపుతామనేదాన్ని నిర్దేశిస్తుంది. పొద్దున్నే నిద్రలేవగానే బద్ధకంగా అనిపించడం, రోజంతా అలసటగా ఉండటం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. అయితే ఉదయం పూట కొన్ని చిన్న చిన్న అలవాట్లను మన దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా మార్చుకోవడమే కాకుండా మన ఉత్పాదకతను విశేషంగా పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడే 4 ముఖ్యమైన అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం:

నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగడం

రాత్రంతా సుమారు 7-8 గంటల నిద్ర తర్వాత మన శరీరం స్వల్ప నిర్జలీకరణానికి గురవుతుంది. అందుకే ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి ముందే కనీసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ప్రయోజనం: ఇది జీర్ణవ్యవస్థను యాక్టివ్ చేస్తుంది, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది మరియు మెదడు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది.

తేలికపాటి వ్యాయామం లేదా యోగా

ఉదయాన్నే కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. వేగంగా నడవడం, యోగా లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది.

ప్రయోజనం: వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి రోజంతా రోజంతా ఉత్సాహంగా ఉండేలా మూడ్‌ను బూస్ట్ చేస్తాయి.

ఉదయపు ఎండ తగలడం

ఉదయం పూట కాసేపు సూర్యరశ్మిలో గడపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఉదయాన్నే లేచి కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఇంట్లోకి రానివ్వాలి.

ప్రయోజనం: సూర్యరశ్మి వల్ల శరీరానికి విటమిన్ డి లభించడమే కాకుండా మన నిద్ర-మేల్కొనే చక్రాన్ని క్రమబద్ధీకరించే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యమవుతుంది. దీనివల్ల రాత్రివేళల్లో మంచి నిద్ర పడుతుంది.

పోషకాహారంతో కూడిన అల్పాహారం

"టిఫిన్ రాజులా చేయాలి" అంటారు. ఉదయం పూట తీసుకునే అల్పాహారం రోజంతటికీ కావలసిన శక్తిని అందిస్తుంది. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ లేదా అధిక చక్కెరలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి.

ప్రయోజనం: ప్రోటీన్లు, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి, రోజంతా నీసస పడకుండా శక్తి లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story