Eat Cardamom Before Bed: మన భారతీయ వంటగదిలో యాలకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం సువాసన కోసమే కాదు.. ఆయుర్వేదంలో దీనిని ఒక గొప్ప ఔషధంగా చెప్తారు.చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు యాలకులు నమిలి తినే అలవాటు ఉంటుంది. మరి ఇలా రాత్రిపూట యాలకులు తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

1. జీర్ణక్రియ మెరుగవుతుంది

రాత్రిపూట హెవీగా భోజనం చేయడం వల్ల చాలా మందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పడుకునే ముందు ఒక యాలక్కాయను నమిలితే.. అది జీర్ణ ఎంజైమ్లను యాక్టివేట్ చేసి, ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది.

2. నోటి దుర్వాసన మాయం

యాలకులు ఒక బెస్ట్ నేచురల్ మౌత్ ఫ్రెషనర్. రాత్రి పడుకునే ముందు వీటిని నమలడం వల్ల.. నోటిలోని బ్యాక్టీరియా నశించి, ఉదయాన్నే నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

3. ప్రశాంతమైన నిద్ర

యాలకుల నుంచి వచ్చే చక్కని సువాసన మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల రాత్రిపూట హాయిగా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

4. శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు

జలుబు, దగ్గు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడేవారికి యాలకులు బాగా పనిచేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల శ్వాస మార్గాలను క్లియర్ చేసి, శ్వాస సులభంగా ఆడేలా సహాయపడతాయి.

5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది

యాలకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ రాత్రి పూట వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story