Eat Mango with Curd: పండ్లలో రాజా అయిన మామిడిని ఇష్టపడని వారుండరు. అయితే.. మామిడి పండు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.మామిడి పండు తిన్న వెంటనే చాలామందికి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేస్తే తీవ్రమైన కడుపునొప్పి, ఎసిడిటీ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మామిడి పండు తిన్న కనీసం అరగంట తర్వాతే నీళ్లు తాగాలి. అలాగే.. పెరుగు, మామిడిపండు కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. మామిడి వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.. పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే శరీరంలో టాక్సిన్స్ (విషపదార్థాలు) ఏర్పడి, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇక మామిడి పండు తిన్నాక పొరపాటున కూడా కాకరకాయ కూర తినకూడదు. దీనివల్ల వికారం, వాంతులు అవ్వడమే కాకుండా.. ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మామిడి పండు తిని వెంటనే కూల్ డ్రింక్స్ తాగితే మీ బాడీలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతాయి. అయితే.. ఒకప్పుడు వేసవి అంటే మామిడి రుచుల సందడి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న పండ్లలో ఆ సహజమైన తీపి, వాసన, రుచి ఎక్కడా కనిపించడం లేదు. పండ్లను వేగంగా మగ్గించేందుకు వ్యాపారులు 'కాల్షియం కార్బైడ్‌'ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

హార్టికల్చర్ నిపుణుల ప్రకారం.. ఈ కాల్షియం కార్బైడ్ విడుదల చేసే 'ఎసిటిలిన్ వాయువు' పచ్చికాయను కేవలం పైపైన మాత్రమే పసుపు రంగులోకి మారుస్తుంది. దీనివల్ల పండు లోపల సహజంగా జరగాల్సిన చక్కెర మార్పులు, పోషక విలువల అభివృద్ధి అస్సలు జరగవు. ఇలాంటి పండ్లలో తీపి తగ్గిపోవడమే కాకుండా.. తిన్న తర్వాత గొంతు గీరగా అనిపించడం, కడుపులో అసౌకర్యం, చేదు రుచి వంటి సమస్యలు వస్తాయి.కాల్షియం కార్బైడ్‌లో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి మలినాలు మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story