Eat a Handful of Cashews Every Day: జీడిపప్పు అనగానే చాలా మంది కేవలం రుచి కోసమే తింటుంటారు. మరికొందరైతే ఇందులో కొవ్వు

ఎక్కువగా ఉంటుందని, లావు అయిపోతామనే భయంతో దీనికి దూరంగా ఉంటారు. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పు కేవలం రుచికరమైన డ్రై ఫ్రూట్ మాత్రమే కాదు, ఇది శరీరానికి మేలు చేసే పోషకాల గని. జీడిపప్పును రోజూ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆ నమ్మకం అబద్ధం..

జీడిపప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందనేది నిజమే అయినప్పటికీ, అది శరీరానికి హాని చేసే కొవ్వు కాదు. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా మారడానికి, గుండెపోటు వంటి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

క్యాన్సర్ నివారణ - రక్తపోటు నియంత్రణ

జీడిపప్పులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణను సీరం చేసి, రక్తపోటు అదుపులో ఉండేలా సహాయపడుతుంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షణ

మన శరీరంలోని మలినాలను శుద్ధి చేసే మూత్రపిండాల ఆరోగ్యానికి జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. మనం తినే తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించే శక్తి జీడిపప్పుకు ఉందని పరిశోధనల్లో తేలింది.

వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది

జీడిపప్పులో జింక్, ఐరన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ముదిరిపోవడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జీడిపప్పులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పరిమిత మోతాదులో జీడిపప్పును డైట్‌లో చేర్చుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు

అధిక క్యాలరీలు

పీచు పదార్థం, ప్రొటీన్లు

యాంటీఆక్సిడెంట్లు

ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, జింక్.

PolitEnt Media

PolitEnt Media

Next Story