Women Who Smoke and Drink Should Be Careful: ఆధునిక జీవనశైలిలో అలవాట్లు మారుతున్నాయి. అయితే, సిగరెట్లు, మద్యం సేవించడం అనేది కేవలం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు.. మహిళల విషయంలో ఇది మరింత ప్రమాదకరమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే, ఈ అలవాట్లు ఉన్న మహిళలకు క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తిస్తున్నారు.

అసలు మహిళలకే ఎందుకు ఎక్కువ ముప్పు? పరిశోధకుల ప్రకారం.. పొగాకులోని హానికారక రసాయనాలకు మహిళల శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. మహిళల్లోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు, ఇతర ఎంజైమ్‌లు పొగాకులోని విషతుల్యాలతో కలిసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. అంటే, ఒకే స్థాయిలో ధూమపానం చేసినా, పురుషుల కంటే మహిళల శరీరంపై దాని ప్రభావం రెట్టింపు స్థాయిలో ఉంటోంది.

ఈ అలవాట్ల వల్ల కేవలం సాధారణ అనారోగ్యం మాత్రమే కాదు, ప్రాణాంతక వ్యాధులు దరి చేరుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ , ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు మహిళల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పాటు గుండె జబ్బులు, శ్వాసకోస సంబంధిత వ్యాధి అయిన 'ఎంఫిసెమా' (Emphysema) వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. పొగాకు, మద్యం నేరుగా మహిళల శరీర వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.

చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికో లేదా ఫ్యాషన్ కోసమో ఈ అలవాట్లకు లోనవుతుంటారు. కానీ, అవి శరీరంలోని అంతర్గత అవయవాలను లోలోపలే దెబ్బతీస్తాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే, ఈ వ్యసనాలకు దూరంగా ఉండటమే ఏకైక మార్గం.

PolitEnt Media

PolitEnt Media

Next Story