Working from Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అయితే ఆఫీస్ పని కోసం మీ మంచాన్ని (Bed) వర్క్‌స్లేస్‌గా మార్చుకున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాటు మీ కెరీర్ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచంపై కూర్చుని పనిచేయడం వల్ల కలిగే వాస్తు దోషాలు నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- వర్క్ ఫ్రమ్ హోమ్ & వాస్తు నియమాలు

కరోనా తర్వాత 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతి విపరీతంగా పెరిగింది. సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది బెడ్‌పై లాప్‌టాప్ పెట్టుకొని గంటల తరబడి పనిచేస్తుంటారు. అయితే చూడటానికి ఇది చాలా కంఫర్టబుల్‌గా అనిపించినప్పటికీ.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అత్యంత హానికరమైన అలవాటు.

1. ఎనర్జీ లెవెల్స్ మందగించడం:

వాస్తు శాస్త్రం ప్రకారం మంచం అనేది కేవలం విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన నిద్ర కోసం మాత్రమే నిర్దేశించబడింది. అక్కడ కూర్చుని ఆఫీస్ పనులు, టెన్షన్లతో కూడిన డిస్కషన్లు చేయడం వల్ల నిద్రపోయే ప్రాంతంలో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది. ఇది మీ ఉత్సాహాన్ని తగ్గించి, సోమరితనానికి దారితీస్తుంది.

2. కెరీర్ వృద్ధికి అడ్డంకులు

పనిచేసే ప్రదేశం ఎప్పుడూ ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండాలి. బెడ్‌పై పడుకుని లేదా అర్ధ-భంగిమలో కూర్చుని పనిచేయడం వల్ల వృత్తిపరమైన ఎదుగుదల నిలిచిపోతుంది. ఆఫీస్‌లో ప్రమోషన్లు రావడంలో ఆటంకాలు ఎదురుకావడంతో పాటు, మీ పనితీరుపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

3. ఆర్థిక నష్టాలు & అస్థిరత :

నిద్రించే స్థలంలో ఆఫీస్ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని వాస్తు నమ్ముతుంది. ఇది అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి మరియు సంపద కోల్పోయే పరిస్థితులకు దారితీస్తుంది. డబ్బు సంపాదించే మార్గాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.

4. వ్యక్తిగత జీవితంపై ప్రభావం :

బెడ్‌ను ఆఫీస్‌గా మార్చుకోవడం వల్ల ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. పడుకునే చోట కూడా ఆఫీస్ టెన్షన్లు వెంటాడటం వల్ల ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది. ఇది మానసిక ఆందోళన (Anxiety) నిద్రలేమి సమస్యలకు కారణమవుతుంది.

5. ఏకాగ్రత లోపించడం :

మంచంపై కూర్చున్నప్పుడు మెదడుకు విశ్రాంతి తీసుకోవాలనే సంకేతాలు వెళ్తుంటాయి. అలాంటి చోట కూర్చుని ఆఫీస్ టార్గెట్లు పూర్తి చేయడం కష్టమవుతుంది. ఏకాగ్రత కుదరక చేసే పనుల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story