ప్రస్తుతం బనక చర్ల ప్రయారిటీ కాదు - సిపిఐ నారాయణ
టిఆర్ఎస్ రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తోంది

రేవంత్ ఎలెక్టెడ్ సీఎం అని...సీఎం ను బ్లేమ్ చెయ్యడం అంటే.. బ్లాక్ మెయిల్ చెయ్యడమే అని సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ అన్నారు. పొట్టోడు గట్టోడు.. అందరి జుట్టులో దూరి పోయే వాడని రేవంత్ రెడ్డిని కొనియాడారు. న్యూఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలని సూచించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం పని చేస్తారని, తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇద్దరు సిఎంలు మాటాడుకుంటేనే పరిష్కారం జరుగుతుందన్నారు. నీళ్లను సృష్టించలేం.. ఉన్న నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని, సముద్రంలోకి దాదాపు 2000 టీఎంసీలు పోతూనే ఉంటాయన్నారు.
సిపిఐ నేత నారాయణ కామెంట్స్
ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటి సమస్యలు ఉన్నాయని, జల వివాద పరిష్కారాల కోసం కమిటీ వేయడం మంచిదేనని స్వాగతించారు. కమిటీ ప్రక్రియను నాన్చ కుండా త్వరగా పూర్తి చేయండన్నారు. నీళ్ల విషయంలో లెక్కలు తేల్చాలి. ఎవరు ఎన్ని వాడుతున్నారో లెక్క పెట్టండని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
ఎవరేం ప్రాజెక్టులు కట్టాలనుకుంటున్నారో.. ప్రపోజల్ పెట్టాలని నారాయణ కోరారు. మిగులు జలాలకు సంబంధించి ఒక అంచనా వేసుకోవాలని, జలాల సమస్య పరిష్కారం కాకుండా కొత్త ప్రాజెక్టులు కట్టడం కరెక్ట్ కాదన్నారు.
సాధ్యం కానివి సుసాధ్యం చేయడానికి ప్రభుత్వం ఉంది. రాయల సీమ కరువు ప్రాంతం.. రాయల సీమకు నీళ్ళు కావాలని డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. నీళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దు.. తల్లిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినట్లు అవుతుంది. ఏపీ తెలంగాణలో రాజకీయ పబ్బం కోసం.. నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు
రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుని.. సమృద్ధిగా జలాలను ఉపయోగించుకుని బాగుపడాలి. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞానికి మొదట సపోర్ట్ చేసింది మేమే. నీటి ప్రాజెక్టులకు మేం ఎపుడూ సపోర్ట్ చేస్తాం. కాళేశ్వరం కు పునాదులు సరిగ్గా వెయ్యలేదు. రాజకీయ జోక్యం జరిగింది. పెళ్లి అపుడు పెళ్లి మంత్రం.. చావు అపుడు చావు మంత్రం వాడాలి. బనక చర్ల పై అతిగా ప్రవర్తిస్తున్నారు.. దాని జోలికి పోవద్దు అన్నాను. పాత ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి.
ప్రస్తుతం బనక చర్ల ప్రయారిటీ కాదు. కొందరు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ పర్మినెంట్ కాదు. ఇన్స్టాంట్ కాఫీ లాంటిది. తెలంగాణ సెంటిమెంట్ పోవడానికి కారణం కేసీఆర్. Trs ను కేసీఆర్ brs చేశాడు. కేసీఆర్ క్యాబినెట్ లో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు 12 మంది ఉండే వాళ్ళు. టిఆర్ఎస్ రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తోంది
