అల్లూరి చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయం

డ్రాగన్ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా కయదు కుర్రాళ్ల మదిని దోచుకుంది. కయదు చేసినవి కొన్ని సినిమాలే అయినా దక్షిణాదిలో అభిమానులను అలరించింది.
కయదు లోహర్ అస్సాంలోని తేజ్‌పూర్ లో 2000 ఏప్రిల్ 11న జన్మించింది. కామర్స్ లో డిగ్రీ చేసింది.
కయదు కుటుంబం పూణేలో స్థిరపడింది. మొదట మోడల్ గా గ్లామర్ ప్రపంచానికి పరిచయమైన కయదు..అనతికాలంలోనే స్టార్ గా మారింది.
2021లో కన్నడ చిత్రం మొగిల్‌పేటతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కత్తిలాంటి కయదు…క్రమంగా దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది.
2022లో పాథోన్‌పథం నూట్టండు మలయాళ చిత్రం చేసిన కయదు…అదే ఏడాది తెలుగులో అల్లూరి చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయం అయింది.
ఫిబ్రవరి 21న తెరపైకి వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో కోలీవుడ్ లో అరంగేట్రం చేసిన కయదు ఆ సినిమాలో నటనకు ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటికే యాభై కోట్లు దాటిన డ్రాగన్ మూవీ వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో ఎవరీ అందాల భామ అని సౌత్ లో చర్చ జరుగుతోంది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో కయదు లోహర్ కోలీవుడ్ లో కేక పుట్టిస్తోంది.
ప్రస్తుతం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తమిళ సినిమా విడుదల కాగా మరోకటి ఇదయం మురళీ(తమిళం), ఓరు జాతి జాతకమ్(మళయాలం) చిత్రీకరణ జరుగుతోంది.
ఇప్పుడు విశ్వక్‌సేన్ 'ఫంకీ', రవితేజ కొత్త సినిమాలో ఛాన్స్‌లు దక్కాయని సమాచారం.
courtesy : instagram
