స్వేచ్ఛ ఆత్మహత్య!

Anchor Swechha: ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్, స్పెషల్ కరస్పాండెంట్ స్వేచ్ఛ బలవంతంగా ప్రాణం తీసుకుంది! వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూ వెళ్ళిపోయింది! గాంధీనగర్ పక్కనే జవహర్ నగర్ లో పెంట్ హౌస్ లో ఉంటున్న స్వేచ్ఛ ఇంట్లో చున్నీ తో ఉ*రి వేసుకుని కనుమూసింది! పోలీసులకు సమాచారం తెలిసి వెంటనే ఆమె భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె తలిదండ్రులు శ్రీదేవి, తెలంగాణ శంకర్ దగ్గరలోనే రామ్ నగర్ లో నివాసం వుంటున్నారు.స్వేచ్ఛ వయసు 40 కాగా ఆమెకు 13 ఏళ్ల సంధ్య కమల్ అనే కుమార్తె వుంది.

మొదటి వివాహం విడాకులకు దారి తీసింది! రెండవ వివాహం సరిగా కుదురుకోని పరిస్థితి! స్వేచ్ఛ ధైర్యవంతురాలు! పోరాటం చేస్తూనే వుంది! మంచి కవయిత్రి కూడా! గత ఏడాది ఆగస్టులో ఆమె రచించిన తెలంగిణి తొలి కవితా సంపుటిని రవీంద్రభారతిలో విడుదల చేసింది! ప్రకృతిని ఎంతో ఇష్టపడే స్వేచ్ఛ అన్యాయాన్ని అంతే సూటిగా ప్రశ్నిస్తుంది! తెలంగాణ ఉద్యమంలో మహిళా పాత్రికేయురాలిగా తన వంతు కీలక పాత్ర పోషించింది!

జర్నలిజం అంటే స్వేచ్ఛకు ఎంతో ఇష్టం! తొలుత మహా న్యూస్ లో చేరింది! ఆ తరువాత HMTV, అక్కడ నుంచి 12 ఏళ్లు tv9 లో చేసి మంచి యాంకర్ గా, హోస్ట్ గా, ఇంటర్వ్యూయర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు పొందింది! కొన్నాళ్ళు మళ్ళీ V6, HMTV లో చేసి గత మూడేళ్లుగా టీ న్యూస్ లో చేస్తోంది! నమస్తే తెలంగాణ పత్రిక ఎడిట్ పేజీ లో వ్యాసాలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంది! ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హొసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story