పది వేలమంది భక్తులతో సంపూర్ణ భగవద్గీత పారాయణం

గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షితున్నారు పరపపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తం గా వున్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు శ్రీ స్వామీజీ.

అలా పూజ్య స్వామీజీ చూపిన మార్గంలో భగవద్గీతను కంఠస్థం చేసి ఎందరో తమ జీవితాల్లో మార్పును చూస్తున్నారు. మన సనాతన ధర్మం ద్వారా సమసమాజ నిర్మానానికి అహర్నిశం శ్రమిస్తూ ఆధాత్మికతను సుస్థిరం చేస్తున్న మహనీయులు, అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు శ్రీ స్వామీజీ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా పది వేలమంది భక్తులతో అమెరికాదేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఫ్రీస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచంలోని అనేక దేశాలనుండి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను

పఠించారు.

Politent News Web3

Politent News Web3

Next Story