✕
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సచివాలయం సమీపంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయంలో పలువురు సచివాలయ అధికారులు, సచివాలయ సిబ్బంది పూజలు నిర్వహించారు. సచివాలయం ప్రాంగణం నార్త్ గేట్ నుండి ప్రారంభమైన ఉత్సవాల ఊరేగింపు బాహుబలి గేట్, సౌత్ గేట్ ద్వారా పోచమ్మ దేవాలయం వరకు కొనసాగింది. ఈ ఊరేగింపులో డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనలతో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు

Politent News Web3
Next Story