Chatting in code language on social media... RSS leaders are the target

దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు లెక్కకు మించి కుట్రలు చేస్తున్నాయి. ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ పేరుతో ఓ వర్గం యువతను చెరదీస్తున్న టెర్రర్ గ్రూపులు వారి ద్వారా దేశంలో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు తెరలేపుతున్నాయి. తాజాగా విజయనగరం విద్యార్థి కేసులో దిగ్భ్రాంతికర ఆంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, వరంగల్, విజయనగరం యువకులతో గ్రూప్ క్రియేట్ చేశాడు. సౌదీలో ఉంటున్న ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థ ఏర్పాటు చేశాడు సిరాజ్. అహం సంస్థ కోసం 40 లక్షల నగదు సిరాజ్‌కు పంపాడు ఇమ్రాన్. పేలుళ్ల కేసులో సిరాజ్‌, సమీర్‌ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ ఫోన్‌ చాటింగ్స్‌ రిట్రీవ్ చేశారు. ఇన్‌స్టాలో కోడ్‌ భాషలో సిరాజ్, సమీర్ మాట్లాడుకున్నారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ చేశారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించాడు. కెమికల్ ల్యాబ్‌కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు.

ఆర్ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని సిరాజ్ యువకులకు తెలిపాడు. ఆ తర్వాత మరిన్ని ప్రణాళికలు అమలు చేద్దామని సిరాజ్ కార్యచరణ రూపొందించాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్‌లో చూపెట్టుకున్నాడు సిరాజ్. 12 మంది కలిసి గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకుందామని తెలిపాడు సిరాజ్. దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసు విచారణలో సంచలన విషయాలు విచారణలో బయటపడుతున్నాయి. కేంద్ర నిఘా సంస్థలు తీగలాగితే డొంక కదులుతోంది.

Updated On 23 May 2025 1:54 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story