✕
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తాజా బులెటిన్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలుపడే అవకాశం ఉంది.
మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

Politent News Web3
Next Story