parents behaviour: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్కరినొకరు పట్టించుకోవడమే గగనమై పోయింది. పక్కవారి సంగతి పక్కన పెడితే కన్న పిల్లలను కూడా సరిగా చూడలేని పరిస్థితి.పొద్దున లేచి నుంచి ఉరుకుల పరుగుల జీవితంతో వారి ఆలనా పాలన చూసుకోవడం కష్టమై పోయింది. అయితే పిల్లలతో తల్లిదండ్రుల అనుభందం మెరుగవ్వాలంటే ఏం చెయ్యాలి.

పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరచుకోవాలనుకునే తండ్రులు సెలవు రోజుల్లో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యాలని అమెరికా పరిశోధకులు చేపట్టిన ఓ స్టడీ ద్వారా తెలుస్తోంది. మీ వర్కింగ్ డేస్లో ఎలాగూ వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చెయ్యలేరు. కనీసం సెలవు రోజులైనా వాళ్లతో గడపండి... వాళ్లు చెప్పేది వినండి. మీరు కూడా ఏదో ఒకటి వాళ్లతో పంచుకోండి. వీలైతే వాళ్లతో ఆడండి... అని ఆ పరిశోధన తండ్రులకు సూచనలు చేసింది. ఇది ఫ్యామిలీ సైకాలజీ అనే జర్నల్లో పబ్లిష్ అయింది.

చిన్నప్పుడు తండ్రులు పిల్లలతో ఎలాంటి సంబంధాలు ఏర్పరుచుకుంటారో... అవే వాళ్లు పెద్దవాళ్లు అయినాక రిఫ్లెక్ట్ అవుతాయి. ఎవరైతే సెలవురోజుల్లో వాళ్ల పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. వర్క్ డేస్​ లో పిల్లల పట్ల కేరింగ్ గా.. హాలిడేస్​ లో షేరింగ్ గా ఉండాలి' అని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రొఫెసర్-జియోఫ్రీ బ్రౌన్ చెప్పాడు.

మొత్తం 80 మంది తండ్రి, బిడ్డల జంటలపై పరిశోధకులు స్టడీ చేశారు. వీళ్లలో పిల్లలంతా మూడేళ్లకు పైబడిన వాళ్ళే వాళ్లందరికీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. వాళ్ల నుంచి రాబట్టిన సమాచారాన్ని విశ్లేషించి సెలవు రోజుల్లో పిల్లలతో గడిపిన తండ్రీ.. పిల్లల మధ్య అనుబంధం చాలా బలంగా ఉంది అని నిర్ధారించారు.

Next Story