Quit It Permanently: అమెరికాలో స్థిరపడాలనే కలతో వెళ్లిన భారతీయుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం, అక్కడ నివసిస్తున్న భారతీయులలో సుమారు 40 శాతం మంది ఇక అమెరికాను శాశ్వతంగా వదిలి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు “అమెరికన్ డ్రీమ్”గా భావించిన జీవితం, ఇప్పుడు అనేక సవాళ్లతో నిండిపోతుండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అత్యంత కీలక సమస్యగా గ్రీన్‌కార్డు ఆలస్యం మారింది. భారతీయులకు గ్రీన్‌కార్డు పొందేందుకు 30 నుంచి 40 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ స్థిరత్వం వంటి అంశాలు ప్రభావితం అవుతున్నాయి.

ఇక వలస విధానాల్లో కఠినతరం, హెచ్-1బీ వీసాలపై అనిశ్చితి, ఉద్యోగ అవకాశాల్లో తగ్గుదల వంటి అంశాలు భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో రాజకీయ పరిణామాలు, వలసదారులపై పెరుగుతున్న వ్యతిరేకత కూడా వారిలో అస్థిరత భావాన్ని పెంచుతున్నాయి.

కృత్రిమ మేధ (AI) ప్రభావంతో ఉద్యోగ రంగంలో మార్పులు రావడం, స్థానికులకు ఉద్యోగాలను ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాలు కూడా విదేశీయులకు అవకాశాలను తగ్గిస్తున్నాయి. దీంతో అమెరికాలో భవిష్యత్తు అనిశ్చితంగా ఉందనే భావన బలపడుతోంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, కొంతమంది భారతీయులు స్వదేశానికి తిరిగి రావడం లేదా ఇతర దేశాల్లో స్థిరపడే మార్గాలను పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు అత్యంత ఆకర్షణీయంగా కనిపించిన అమెరికా జీవితం, ఇప్పుడు పునరాలోచనకు గురవుతుండటం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story