Baluchistan : బలూచ్ లో 9 మంది బస్సు ప్రయాణికుల హతం
ఐడీ కార్డులు అడిగి మరీ చంపిన దుండగులు

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఘోరం చోటు చేసుకుంది. బస్సులో వెళుతున్న ప్రయాణికులను అపహరించి సమీపంలోని కొండగుట్టల్లోకి తీసుకు వెళ్ళి 9 మందిని కాల్చి చంపారు. కాల్పులకు తెగబడింది ఎవరనేది ఇంకా నిర్థారణ కానప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దారుణానికి పాల్పడినట్లు పాక్ ప్రభుత్వం అనుమానిస్తోంది. సాధారణంగా ఇటువంటి దాడులు బిఎల్‌ఏ నే చేస్తుంటుందని పాక్ అధికార వర్గాలు అంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ప్రయాణిస్తున్న బస్సులను కొంత మంది దుండగుల అడ్డుకుని అందులోంచి తొమ్మిది మంది ప్రయాణికులను తూపాకీలు చూపించి సమీపంలోని కొండ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి ఐడీ కార్డులు అడిగి మరీ చంపేశారు. ఆ కొండ ప్రాంతం నుంచి శరీరం మొత్తం తూటా గాయాలు ఉన్న 9 మృత దేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ వర్గాలు ప్రకటించారు. పాకిస్తాన్ భద్రతా దళాలు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడిని ఆపాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బలూచ్ వేర్పాటు వాద గ్రూపులు గతంలో కూడా ఇటువంటి దాడులకు పాలపడ్డాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తూ ఉంటాయి. తమ దేశ ఖనిజ సంపద అంతా దోచుకుని పంజాబ్ ప్రావిన్స్ లో పెడుతున్నారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. గతంలో కూడా 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలును ఆధీనంలోకి తీసుకుని 30 మంది ప్రయాణికులను హతమార్చింది. దీంతో హెలీకాఫ్టర్లు, ద్రోణ్లతో హుటాహుటీన పాకిస్తాన్ రంగంలోకి దిగి దాడులు జరిపింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఇలాగే ఐడీ కార్డులు అడిగి 30 మందిని హతమార్చారు. అయితే ఈ సంస్ధపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
