Australia Prime Minister Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి కొనసాగుతున్న యుద్ధం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఇరాన్‌లో ఇంకా ఏమి సాధించాల్సి ఉందని స్పష్టంగా ప్రశ్నించారు. యుద్ధం ఎలా ముగియాలో స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదని విమర్శించారు.

నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ప్రసంగిస్తూ అల్బనీస్ మాట్లాడుతూ, “ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. పొరుగు దేశాలకు ఎలాంటి హాని కలగకుండా దాని సైనిక సామర్థ్యాలను తగ్గించాలనే అమెరికా లక్ష్యాలకు ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చింది. ఆ లక్ష్యాలు సాధించబడ్డాయి. అయినా యుద్ధం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? ఇక్కడ ఇంకా సాధించాల్సింది ఏముంది?” అని ప్రశ్నించారు.

యుద్ధం ఎంతకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. “ఈ సంక్షోభం ప్రారంభమవడానికి ముందు మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు” అని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మరో ప్రసంగంలో అల్బనీస్ ఇప్పటికే హెచ్చరించినట్లు, రానున్న నెలలు మరింత క్లిష్టంగా ఉండవచ్చని అన్నారు. “ఈ యుద్ధంలో ఆస్ట్రేలియా నేరుగా భాగం కాదు. కానీ దాని వల్ల మేము అధిక మూల్యం చెల్లించాల్సి వస్తోంది” అని ఆయన బాధ వ్యక్తం చేశారు.

Updated On  saroj
Next Story